One Plus Vs One plus 12R

One Plus Vs One plus 12R: ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో వన్ ప్లస్ మొబైల్ ఫోన్ దూసుకుపోతుంది. ఇదే తరుణంలో చాలామంది యువత కూడా వన్ ప్లస్ మొబైల్ కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఒకే టైంలో వన్ ప్లస్ 12 మరియు వన్ ప్లస్ 12R మొబైల్ ఫోన్స్ మార్కెట్ లో ఉన్నాయి. మరి ఈ రెండింటిలో ఏ మొబైల్ తీసుకోవాలో తెలియక చాలామంది సతమతమవుతున్నారు. మరి ఇందులో ఏది బెస్ట్ ఫోన్.. దాని ఫీచర్స్ ధర వివరాలు చూద్దాం.

One Plus Vs One plus 12R

ముందుగా వన్ ప్లస్ 12 స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాల అమోలేడ్ డిస్ప్లే కలిగి ఉంది. అంతేకాకుండా 3216×1440 పిక్సల్స్ రిజల్యూషన్ 120HZ రిఫ్రష్ రేట్ తో మన ముందుకు రాబోతోంది. అంతేకాకుండా QUALCOMM SNAPDRAGON 8GEN 1 ప్రాసెసర్ పై ఆధారపడి పని చేస్తుంది. అంతేకాకుండా ఇది 8gb ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 12gb ram , 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ లో వస్తున్నది. (One Plus Vs One plus 12R)

Also Read: iQoo Neo 9 Pro: ఇండియాలో లాంచ్ అయిన ఐకూ నియో 9 ప్రో.. స్పెసిఫికేష‌న్స్‌, ధ‌ర వివ‌రాలు ఇవే!

ఇక వన్ ప్లస్ 12R ఫోన్ విషయానికి వస్తే 6.7అమోలేడ్ డిస్ప్లే,120HZ రిఫ్రెష్ రేట్, మీడియా టెక్ డైమేన్సిటీ 8100 మాక్స్ ప్రాసెసర్ పై పని చేస్తోంది. అంతేకాకుండా వన్ ప్లస్ 12 మొబైల్ లో 50 ఎంపీ ప్రధాన కెమెరా, మిగతావి 32 ఎంపీ టెలిఫోటో లెన్స్, 13 ఎంపీ అల్ట్రా వైల్డ్ లెన్స్ కలిగి ఉంది.

One Plus Vs One plus 12R

12Rలో 50 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ టెలిఫోటో లెన్స్ 2ఎంపీ మాక్రో లెన్స్ సెటప్ తో వస్తోంది. ఈ మొబైల్స్ ధర విషయానికి వస్తే వన్ ప్లస్ 12, స్మార్ట్ ఫోన్ 16gb ,512 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ:69,999, వన్ ప్లస్ 12R 8జీబీ,128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ:39,999 లభిస్తోంది.(One Plus Vs One plus 12R)

Join WhatsApp