OnePlus 12 Goes On Sale In India Today

OnePlus 12: ప్ర‌ముఖ స్మార్ట్‌ఫోన్ల త‌యారీ దిగ్గ‌జం వ‌న్‌ప్ల‌స్ ఇటీవ‌ల భార‌తదేశంలో వ‌న్‌ప్ల‌స్ 12(OnePlus 12)ను ఆవిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. గత వారం దేశంలో వన్‌ప్లస్ 12ఆర్‌తో పాటుగా ఈ హ్యాండ్‌సెట్ లాంచ్ అయింది. ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో విడులైన వ‌న్‌ప్ల‌స్ 12 గ‌డ్జెట్ ల‌వ‌ర్స్ కు పిచ్చపిచ్చ‌గా న‌చ్చేసింది. ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ స్టోర్స్ లోకి ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వ‌స్తుందా అని ఎంతో ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఆ త‌రుణం రానే వ‌చ్చింది. నేటి నుంచి ఇండియాలో వ‌న్‌ప్ల‌స్ 12 సేల్స్ స్టార్ట్ అయ్యాయి.

OnePlus 12 Goes On Sale In India Today

ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను ఆమెజాన్‌, ఆఫ్‌లైన్ స్టోర్‌లు మరియు వ‌న్‌ప్ల‌స్ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. సిల్కీ బ్లాక్ మరియు ఫ్లోవీ ఎమరాల్డ్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి వ‌చ్చింది. వ‌న్‌ప్ల‌స్ 12 స్మార్ట్‌ఫోన్‌లో రెండు వేరియంట్స్ ఉన్నాయి. 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్‌ ధ‌ర‌ రూ. 64,999 మరియు 16జీబీ ర్యామ్ + 512 జీబీ వేరియంట్ ధ‌ర‌ రూ. 69,999గా నిర్ణ‌యించారు.

అయితే ICICI క్రెడిట్ కార్డ్ మరియు OneCard లావాదేవీలతో కంపెనీ ఫ్లాట్ రూ. 2000 తక్షణ తగ్గింపును అందిస్తోంది. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫ‌ర్ కూడా ఉంది. మంచి కండీష‌న్ లో ఉన్న ఫోన్ ను రిట‌ర్న్ చేస్తే రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందుతారు. అంటే మొత్తంగా రూ. 12 వేల వ‌ర‌కు డిస్కౌంట్ ల‌భిస్తోంది. ఇక వ‌న్‌ప్ల‌స్ 12 స్పెసిఫికేష‌న్స్ కూడా ఒక‌సారి ప‌రిశీలిస్తే..(OnePlus 12)

Also Read: Redmi Note 13 Pro: ఈ రెడ్మీ ఫోన్‌ పై రూ. 4,500 డిస్కౌంట్‌..పూర్తి వివరాలు ఇవే

120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నీట్స్ బ్రైట్‌నెస్‌ తో 6.82-అంగుళాల QHD+ డిస్‌ప్లేను వ‌న్‌ప్ల‌స్ 12 స్మార్ట్‌ఫోన్ క‌లిగి ఉంది. 2160Hz హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్ మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్ష‌న్ ను అందించారు. క్వాల్క‌మ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 SoC ప్రాసెస‌ర్ ను అందించారు. ఆండ్రాయిడ్ 14-ఆధారిత ఆక్సిజన్ OS పై ఈ హ్యాండ్‌సెట్ ర‌న్ అవుతుంది. 100W SuperVOOC ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ మరియు 50W AirVOOC వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,400mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇక ఈ ప‌రిక‌రంలో 50MP ప్రైమరీ కెమెరా, 48MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 64MP పెరిస్కోప్ లెన్స్ కూడిన ట్రిపుల్ కెమెరా సెట‌ప్ ఉంటుంది. సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Join WhatsApp