OnePlus 12R Arrives in New Memory Variant in India

OnePlus 12R: దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా ఖచ్చితంగా ఫోన్స్ మాత్రం ఉంటాయి. పక్కన మనిషి ఉన్న లేకున్నా… మొబైల్ ఫోన్ ఉంటే చాలు అన్నట్లుగా లోకం తయారైపోయింది. మొబైల్ ఫోన్ ఇచ్చి… అడవిలో ఉండమన్నా ఉంటారు ఈ జనాలు. అంతలా స్మార్ట్ ఫోన్ అందరికీ అలవాటు అయిపోయింది. మనుషులతో మాట్లాడడం ఆపేసి మొబైల్ ఫోన్ లోనే ఉంటున్నారు. దీనికి తగ్గట్టుగానే మార్కెట్లోకి రకరకాల స్మాల్ ఫోన్స్ వస్తున్నాయి. OnePlus 12R

OnePlus 12R Arrives in New Memory Variant in India

అయితే తాజాగా వన్ ప్లస్ కంపెనీ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ వచ్చింది. జనవరి మాసంలో వన్ ప్లస్ 12 R వచ్చిన సంగతి తెలిసిందే. దీనిని రెండు వేరియంట్ లలో కంపెనీ తీసుకు వచ్చింది. ఇక లేటెస్ట్గా కొత్త మోడల్ కూడా రిలీజ్ చేసింది వన్ ప్లస్. ఇందులో స్నాప్ డ్రాగన్ 8 రెండు ప్రాసెసర్ ను అమర్చింది కంపెనీ. సూపర్ వూక్ చార్జింగ్ సపోర్ట్ తో 5000 mah సామర్థ్యం ఉన్న బ్యాటరీ మనకు అందిస్తున్నారు. OnePlus 12R

Also Read:Vivo T3 5G: క్రేజీ ఫీచ‌ర్ల‌తో ఇండియాలో లాంచ్ అయిన వివో టీ3 5జీ.. ధ‌ర మ‌రియు సేల్ వివ‌రాలు ఇవే!

ఇక వన్ ప్లస్ 12 ఆర్ కొత్త వేరియంట్ ధర విషయానికి వస్తే… 8gb ర్యామ్ మరియు 256 జిబి ఉన్న మోడల్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఈ మోడల్ మొబైల్ ద్వారా 43 వేల రూపాయలుగా ఉంది. ప్రస్తుతం ఆన్లైన్ లో ఈ మొబైల్ కొనుగోలు చేయవచ్చు. ఐసిఐసిఐ బ్యాంకు లేదా వన్ ప్లస్ కార్డు, ఇతర క్రెడిట్ కార్డులు వాడి ఈ మొబైల్ కొనుగోలు చేస్తే మనకు వెయ్యి రూపాయల డిస్కౌంట్ అందిస్తున్నారు. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా మనకు అందిస్తున్నారు. OnePlus 12R

అయితే ఈ మొబైల్ లాంచ్ ఆఫర్ కింద రెడ్ కేబుల్ క్లబ్ ఆఫర్లను కూడా కంపెనీ అందించేందుకు ముందుకు వచ్చింది. అంతేకాకుండా ఈ కొత్త మొబైల్ ఒరిజినల్ కూల్ బ్లూ, ఐరన్ గ్రే కలర్స్ లో మాత్రమే మనకు లభిస్తుంది. ఇక ఈ మొబైల్ కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సల్ కెమెరా వెనుక భాగంలో ఉంటుంది. సెల్ఫీ కెమెరా సైజు 16 మెగాపిక్సల్ ఉంటుంది.OnePlus 12R

Join WhatsApp