OnePlus 12R first sale on February 6

One plus 12R: ఇండియన్ మార్కెట్ లో అనేక రకాల మొబైల్ ఫోన్స్ అందుబాటులోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈమధ్య కాలంలో చాలామంది మొబైల్ ఫోన్స్ విపరీతంగా వాడుతున్నారు. ధర ఎంత ఉన్నప్పటికీ… ఆ మొబైల్ ఫోన్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కాస్ట్లీ మొబైల్ ఫోన్ వాడుతున్నారు.One plus 12R

OnePlus 12R first sale on February 6

మొన్నటి వరకు ఫోర్ జి హ్యాండ్సెట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ విపరీతంగా విక్రయాలు జరుపుకున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఫైజికాలం వచ్చేసింది. దీంతో చాలామంది ఫైజీ మొబైల్ ఫోన్స్ మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఫోర్ జి మొబైల్స్ పక్కకు పెడుతున్నారు. ఈ తరుణంలోనే రకరకాల 5జి మొబైల్ ఫోన్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే తాజాగా వన్ ప్లస్ కంపెనీ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లోకి రాబోతుంది.One plus 12R

Also Read: Instagram Message Editing: ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఎడిట్‌ ఆప్షన్‌.. మెసేజుల్లో పొరపాట్లకు చెక్‌

వన్ ప్లస్ 12R అనే స్మార్ట్ ఫోన్ ఇటీవల లాంచ్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మొబైల్ ఫోన్ కొనుగోలు రేపటి నుంచి అంటే ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కంపెనీ అధికారిక ప్రకటన చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేవారు వెంటనే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని కోరింది. అమెజాన్ అలాగే వన్ ప్లస్ వెబ్సైట్ ద్వారా ఈ మొబైల్ ఫోన్ కొనుగోలు చేసుకోవచ్చని కంపెనీ స్పష్టం చేసింది.

కంపెనీ ప్రకటించిన వివరాల ప్రకారం… ఈ మొబైల్ ఫోన్ ధర అక్షరాల 40,000 రూపాయలు. రేపు ఉదయం నుంచి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని కంపెనీవే లభించింది. ఇక ఈ వన్ ప్లస్ మొబైల్ ఫీచర్స్ ఒకసారి పరిశీలిద్దాం. ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ స్టోరేజ్ వచ్చేసి 8gb ర్యామ్ అలాగే 128 జీబీగా ఉంది. 16 జిబి ర్యామ్ అలాగే 256 జిబి స్టోరేజ్ ఉన్న మొబైల్ ధర 46వేల రూపాయలుగా ఉంది.

అయితే వన్ ప్లస్ 12ఆర్ మొబైల్ ఫోన్ కొనుగోలు చేస్తే మనం వెయ్యి రూపాయల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులు వాడితే మనకు వెయ్యి రూపాయల వరకు డిస్కౌంట్ వస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్ కొనుగోలు చేసిన వారికి ఆరు నెలల గూగుల్ వన్ సంస్క్రిప్షన్ కూడా లభిస్తుంది. మూడు నెలల పాటు యూట్యూబ్ ప్రీమియర్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. ఈ మొబైల్ ఫోన్కు buds కూడా వస్తాయి. ఈ Buds ధర దాదాపు 5వేల రూపాయలు ఉంటుంది.One plus 12R

Join WhatsApp