OnePlus Ace 3V Specifications Leaked

OnePlus Ace 3V: ప్ర‌ముఖ టెక్ సంస్థ వన్‌ప్లస్ ఇటీవల తన ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ 12 సిరీస్‌ను గ్లోబల్ మార్కెట్ తో పాటు ఇండియాలోనూ ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. అయితే కంపెనీ ఇప్పుడు ఏస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌పై పని చేస్తోంది. గత సంవత్సరం వ‌న్‌ప్ల‌స్‌ చైనాలో మూడు ఏస్ బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లను విడుద‌ల అయ్యాయి. ఈ జాబితాలో వ‌న్‌ప్ల‌స్‌ ఏస్ 2, ఏస్ 2వి, ఏస్ 2 ప్రో ఉన్నాయి. ఈ సంవ‌త్స‌రం ఏస్ 3 సిరీస్ ను ఆవిష్క‌రిస్తోంది.

OnePlus Ace 3V Specifications Leaked

ఆల్రెడీ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెస‌ర్ తో వ‌న్‌ప్ల‌స్ ఏస్‌ 3ని ఈ నెల ప్రారంభంలో చెన్నైలో రిలీజ్ చేసింది. ఇప్పుడు వ‌న్‌ప్ల‌స్ ఏజ్ 3వి స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేస్తోంది. అయితే లాంచ్ కు ముందుకు ఈ హ్యాండ్‌సెట్ యొక్క కీల‌క స్పెసిఫికేషన్‌లు Weibo ద్వారా సోష‌ల్ మీడియాలో లీక్ అయ్యాయి. లీకైక స్పెసిఫికేష‌న్స్ ను ఒక‌సారి ప‌రిశీలిస్తే..

వ‌న్‌ప్ల‌స్ ఏస్ 3వి(OnePlus Ace 3V) 120Hz రిఫ్రెష్ రేట్‌తో 1.5K రిజల్యూషన్ ప్యానెల్‌ను కలిగి ఉంటుంద‌ట‌. అలాగే క్వాల‌క్క‌మ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 SoCలో ఈ హ్యాండ్‌సెట్‌ రన్ అవుతుంద‌ని అంటున్నారు. అలాగే 100W వైర్డు ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని ప్యాక్ చేయ‌వ‌చ్చు. డిజైన్ విష‌యానికి వ‌స్తే..ఫోన్ గ్లాస్ బ్యాక్ మరియు ప్లాస్టిక్ ఫ్రేమ్‌ని కలిగి ఉండవచ్చని లీకులు సూచిస్తున్నారు.(OnePlus Ace 3V)

Also Read: iQOO Neo 7 Pro: ఐకూ నియో 7 ప్రోపై రూ. 7 వేలు త‌గ్గింపు.. ఇప్పుడు ధ‌రెంతో తెలుసా?

పరికరం యొక్క ఫ్లాట్ మరియు కర్వ్డ్-ఎడ్జ్ స్క్రీన్ వేరియంట్‌లు ఉండే అవకాశం ఉంది. Ace 3V యొక్క కెమెరా, స్టోరేజ్ మ‌రియు ర్యామ్ పై ఎటువంటి స‌మాచారం. కాబట్టి, ఈ వివరాలను తెలుసుకోవాలంటే తదుపరి నివేదికల కోసం వేచి ఉండాల్సిందే. కాగా, గత సంవత్సరం, ఏస్ 2వి చైనీస్ మార్కెట్‌కు ప్రత్యేకమైనది. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా వ‌న్‌ప్ల‌స్ నార్డ్‌ 3గా రీబ్రాండ్ చేయబడింది. అందువల్ల, వ‌న్‌ప్ల‌స్ ఏజ్ 3వి ప్రపంచవ్యాప్తంగా వ‌న్‌ప్ల‌స్ నార్డ్ 4 లేదా నార్డ్ 5గా లాంచ్ కావచ్చ‌ని అంటున్నారు.

Join WhatsApp