OnePlus Watch 2 with up to 100 hours of battery life launched

OnePlus Watch 2: ప్ర‌ముఖ టెక్ సంస్థ వ‌న్‌ప్ల‌స్ తాజాగా బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2024లో తన రెండవ తరం వాచ్‌ను ఆవిష్కరించింది. అదే వ‌న్‌ప్ల‌స్ వాచ్ 2(OnePlus Watch 2). 100 గంటల బ్యాటరీ లైఫ్‌, మెరుగైన డిజైన్, మెరుగైన ఫీచర్లతో ఈ వాచ్ లాంచ్ అయింది. అలాగే ఈ స్మార్ట్ వాచ్ డ్యూయల్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తుంది. మరియు డ్యూయల్ చిప్ ఆర్కిటెక్చర్‌తో వస్తుంది. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం వ‌న్‌ప్ల‌స్ వాచ్ 2 స్పెసిఫికేష‌న్స్‌, ధ‌ర వివ‌రాల‌పై ఓ లుక్కేసేయండి.

OnePlus Watch 2 with up to 100 hours of battery life launched

వ‌న్‌ప్ల‌స్ వాచ్ 2 స్మార్ట్‌వాచ్‌ 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌, 466×466 పిక్సెల్ రిజల్యూషన్‌తో 1.43-అంగుళాల AMOLED సర్క్యులర్ డిస్‌ప్లేను క‌లిగి ఉంటుంది. ఈ వాచ్ BES 2700 MCU ఎఫిషియెన్సీ చిప్‌సెట్‌తో పాటు క్వాల్క‌మ్ యొక్క స్నాప్‌డ్రాగన్ W5 SoCపై నడుస్తుంది. స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ గూగుల్‌ యాప్‌లను నిర్వహించడం వంటి పనుల కోసం ఉపయోగించబడుతుంది. అలాగే ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్‌ 8.0 మరియు అంతకంటే ఎక్కువ వెర్షన్‌లకు మద్దతు ఇస్తుంది.

వ‌న్‌ప్ల‌స్ వాచ్ 2 మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ మరియు IP68 రేటింగ్‌తో వస్తుంది. ఇది దుమ్ము మరియు నీటికి నిరోధకతను కలిగిస్తుంది. ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్‌కు మద్దతు ఇస్తుంది. 2GB ర్యామ్‌ మరియు 32GB స్టోరేజ్ ఎంపిక‌తో ఈ వాచ్ ఫ్యాక్ చేయ‌బ‌డుతుంది. అలాగే హార్ట్ సెన్సార్, బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, బేరోమీటర్ సెన్సార్‌తో వస్తుంది. ఈ పరిక‌రంలో 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లు ఉంటాయి. ఆటోమేటిక్ వర్కౌట్ డిటెక్షన్ ను క‌లిగి ఉంటుంది.(OnePlus Watch 2)

Also Read: Priyanka Mohan: అభిమాని వింత కోరిక‌.. ఆలోచించ‌కుండా అవి చూపించేసిన ప‌వ‌న్ హీరోయిన్‌!

ఈ స్మార్ట్ వాచ్ స్లీప్‌ ట్రాకింగ్ విశ్లేషణతో వస్తుంది. వ‌న్‌ప్ల‌స్ వాచ్ 2లో 500 mAh బ్యాటరీని అందించారు. స్మార్ట్ మోడ్‌లో ఒక్క ఛార్జ్‌పై 100 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను అందజేస్తుందని కంపెనీ చెబుతోంది. ఇక ధ‌ర విష‌యానికి వ‌స్తే.. వ‌న్‌ప్ల‌స్ వాచ్ 2 రూ 24,999 ధర ట్యాగ్‌తో ప్రారంభం అయింది. బ్లాక్ స్టీల్ మరియు రేడియంట్ స్టీల్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు. OnePlus.in, OnePlus స్టోర్ యాప్, OnePlus ఎక్స్‌పీరియన్స్ స్టోర్, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, మింత్ర వంటి ఆన్‌లైన్‌ మరియు దేశంలోని ఆఫ్‌లైన్ స్టోర్స్ లో 2024 మార్చి 4న మధ్యాహ్నం 12 గంటల నుండి ఈ వాచ్ అమ్మాకాలు స్టార్ట్ అవుతాయి. ICICI బ్యాంక్ OneCardతో కొనుగోలు చేస్తే వ‌న్‌ప్ల‌స్ వాచ్‌2పై రూ. 2,000 తక్షణ తగ్గింపును పొందుతారు.

Join WhatsApp