Oppo F25 pro 5G: New phone from Oppo

Oppo F25 pro 5G: ఒప్పో మొబైల్ రంగంలో దూసుకుపోతున్నటువంటి ఫోన్. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి అనేక మొబైల్ వేరియంట్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఒప్పో కంపెనీ నుంచి సరికొత్త మొబైల్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అదేంటంటే ఒప్పో f25 ప్రో 5g. ఈ మొబైల్ త్వరలో లాంచ్ కు సిద్ధమైంది. దీనికి ముందే సోషల్ మీడియాలో ఈ ఫోన్ సంబంధించి కొన్ని ఫీచర్స్ వివరాలు బయటకు వచ్చాయి.. అవేంటో చూద్దాం..

Oppo F25 pro 5G: New phone from Oppo

ఒప్పో f25 ప్రో మొబైల్ ఓషన్ బ్లూ మరియు లావా రెడ్ అనే రెండు కలర్ ఆప్షన్స్ లో వస్తుంది. ఈ మొబైల్ ను ఫిబ్రవరి 29న విడుదల చేయనుందని ఇప్పటికే కంపెనీ తెలియజేసింది. దాని యొక్క ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, ధర ఇతర వివరాలు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు మధ్యరకం శ్రేణి ఫోన్ కోసం చూస్తున్నట్టయితే F25 ప్రో మొబైల్ మంచి ఆప్షన్ గా చెప్పవచ్చు. (Oppo F25 pro 5G)

Also Read: Upcoming Smartphones: మార్చిలో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న టాప్ స్మార్ట్ ఫోన్లు ఇవే..!

ఈ మొబైల్ డిజైన్ రేణు 11 ఎఫ్ ఫోన్ ఫీచర్లకు దగ్గరగా ఉంటుంది. ఈ మొబైల్ 8+128జీబీ మరియు 8+256జీబీ అనే రెండు స్టోరేజ్ ఆప్షన్స్ లో లభిస్తోంది. అంతేకాకుండా ఈ ఫోన్ ముందు మరియు వెనకాల 4k వీడియో రికార్డింగ్,120Hz బార్డర్ లెస్ AMOLED డిస్ప్లే కలిగి ఉంది. అంతేకాకుండా 67 w సూపర్ వుక్ ఛార్జింగ్ సపోర్టు లభిస్తోంది. కాకుండా ఈ ఫోన్ IP65 వాటర్ మరియు డస్ట్ రెసిస్టెన్స్ తో వస్తున్నది.

Oppo F25 pro 5G: New phone from Oppo

ఒప్పో ఎఫ్ 25 ప్రో 5జి స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే 6.7 అంగుళాల పూర్తి హెచ్డి ప్లస్ డిస్ప్లే, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 64 ఎంపీ వెనుక కెమెరా సెట్ అప్ కలిగి ఉంది. అంతేకాకుండా ఈ మొబైల్ కలర్ ఓఎస్ 14 తో ఆండ్రాయిడ్ 14 లో రన్ అవుతుంది . మీడియా టెక్ డైమన్ సిటీ 7050 ప్రాసెసర్ అమర్చబడి ఉంది. అలాగే 5g సపోర్ట్, డ్యూయల్ 4g వోల్ట్, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్ C వంటివి ఉంటాయి. కాకుండా ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది.(Oppo F25 pro 5G)

Join WhatsApp