Oppo Reno 11 5G Pricing & Discounts

Oppo Reno 11 5G: రీసెంట్ గా ప్ర‌ముఖ స్మార్ట్‌ఫోన్ల త‌యారీ దిగ్గ‌జం ఒప్పో నుంచి రెండు కొత్త మొబైల్స్ లాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే. అందులో ఒప్పో రెనో 11 5జీ ఒక‌టి కాగా.. మ‌రొక‌టి ఒప్పో రెనో 11 ప్రో. గ‌త ఏడాది చైనాలో ప్రారంభ‌మైన ఈ స్మార్ట్‌ఫోన్స్‌.. జ‌న‌వ‌రి రెండో వారంలో ఇండియాలోకి అడుగుపెట్టాయి. అయితే నేటి నుంచి ఒప్పో రెనో 11 5జీ(Oppo Reno 11 5G) సేల్స్ ప్రారంభం అయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్ లో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ప్రారంభ ధర రూ. 29,999గా నిర్ణ‌యించారు.

Oppo Reno 11 5G Pricing & Discounts

అలాగే 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ. 31,999 నుండి ప్రారంభమవుతుందని వెల్ల‌డించారు అయితే ఈ రెండు కాన్ఫిగరేషన్‌లు ప్రస్తుతం భారీ తగ్గింపులతో అందించబడుతున్నాయి. ఏకంగా రూ. 6 వేలు త‌గ్గింపుతో మీరు ఒప్పో రెనో 11 5జీని సొంతం చేసుకునే వెసులుబాటు ఉంది. వివిధ బ్యాంకుల‌ క్రెడిట్ మ‌రియు డెబిట్ కార్డుల‌పై రూ. 3000 త‌క్ష‌ణ త‌గ్గింపు ల‌భిస్తుంది. అద‌నంగా రూ. 3,000 తగ్గింపు ద్వారా మీరు ఈ డీల్‌ను సురక్షితం చేసుకోవచ్చు. ఈ డ‌బ్బును 10 సూపర్ కాయిన్‌లతో రీడీమ్ చేసుకునే ఆప్ష‌న్ ఉంది.

Also Read: Realme 12 Pro+: అద‌ర‌హో అనిపిస్తున్న‌ రియ‌ల్‌మీ 12 ప్రో+ స్పెసిఫికేషన్స్‌.. ఇంత‌కీ లాంచ్ ఎప్పుడంటే?

వెబ్‌సైట్‌లో ఆఫర్ కనిపించకపోతే మీరు ఫ్లిప్‌కార్ట్ యాప్ ద్వారా దాన్ని యాక్సెస్ చేసుకోవ‌చ్చు. మెత్తంగా రూ. 6 వేలు త‌గ్గింపుతో 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ రూ. 31,999 మ‌రియు 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ రూ. 28,999కు అందుబాటులో ఉన్నాయి. ఒప్పో రెనో 11 5జీ స్పెసిఫికేష‌న్స్ విష‌యానికి వ‌స్తే.. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల‌​ ఫుల్ హెచ్ డీ+ అమోఎల్ఈడీ డిస్​ప్లేతో ఈ స్మార్ట్‌ఫోన్ వ‌చ్చింది. 10-బిట్ కలర్, HDR సపోర్ట్ మరియు 950 నీట్స్ బ్రైట్ నెస్‌ను క‌లిగి ఉంది.(Oppo Reno 11 5G)

Oppo Reno 11 5G Pricing & Discounts

మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ ను ఇందులో అమ‌ర్చారు. ఆండ్రాయిడ్ 14-ఆధారిత ColorOS 14పై నడుస్తుంది. ఇది 3 ఓఎస్‌ అప్‌గ్రేడ్‌లు మరియు 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్‌కు హామీ ఇస్తుంది. అలాగే ఈ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెట‌ప్ ఉంటుంది. ఇందులో 50ఎంపీ ప్రైమరీ, 32ఎంపీ టెలిఫొటో, 8 ఎంపీ అల్ట్రా-వైడ్​ లెన్స్​ ఉంటాయి. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 32ఎంపీ ఫ్రెంట్​ కెమెరాను ఇచ్చారు. 80 వాట్‌ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000 mAh బ్యాట‌రీని ఇందులో అందించారు.

Join WhatsApp