Realme 12 Pro+ Key Specifications Leaked Ahead of Launch

Realme 12 Pro+: ఈ జ‌న‌వ‌రి నెల మొత్తం కొత్త స్మార్ట్‌ఫోన్ల లాంచ్‌ల‌తో క‌ల‌క‌ల్లాడిపోతోంది. త్వ‌ర‌లోనే చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు రియ‌ల్‌మీ ఇండియాలో ఓ కొత్త సిరీస్ ను ఆవిష్క‌రించ‌బోతోంది. ఈ సిరీస్ లో రియ‌ల్‌మీ 12 5జీ(Realme 12 5G), రియల్‌మీ 12 ప్రో+(Realme 12 Pro+) అనే రెండు ఫోన్‌లు ఉండ‌బోతున్నాయి. అలాగే ఈ లైన‌ప్ లో రియ‌ల్‌మీ 12 ప్రో మ్యాక్స్‌(Realme 12 Pro Max) కూడా ఉండొచ్చ‌ని అంటున్నారు. జనవరి 29న మధ్యాహ్నం 12 గంటలకు రియ‌ల్‌మీ 12 5జీ సిరీస్ లాంచ్ అవ్వ‌బోతోంది.

Realme 12 Pro+ Key Specifications Leaked Ahead of Launch

ఇప్ప‌టికే ఈ స్మార్ట్‌ఫోన్‌ల యొక్క కొన్ని స్పెసిఫికేషన్‌లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. అయితే తాజాగా రిటైల్ బాక్స్ ప్యాకేజింగ్ యొక్క చిత్రం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇది రియ‌ల్‌మీ 12 ప్రో+ గురించి కెమెరాతో స‌హా కొన్ని కీల‌క స్పెసిఫికేష‌న్స్ ను వెల్లడిస్తుంది. బాక్స్‌పై పేర్కొన్న స్పెసిఫికేషన్స్‌ ప్ర‌కారం.. రియ‌ల్‌మీ 12 ప్రో+ OISతో Sony IMX890 ప్రైమరీ కెమెరా మరియు OISతో పెరిస్కోప్ పోర్ట్రెయిట్ కెమెరాతో వస్తుంది. ఈ రెండు సెన్సార్లు అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో జత చేయబడతాయ‌ని తెలుస్తోంది.

Also Read: Moto G54 5G: ఇండియాలో మోటో జీ54 5జీపై భారీ డిస్కౌంట్‌.. ఇప్ప‌టి ధ‌ర‌లు ఎంతంటే?

అలాగే ఈ హ్యాండ్‌సెట్ 120Hz కర్వ్డ్ విజన్ డిస్‌ప్లేతో రాబోతోంది. క్వాల్క‌మ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 చిప్‌సెట్ ను ఈ ప‌రిక‌రంలో అమ‌ర్చారు. 512జీబీ స్టోరేజ్‌ను ప్యాక్ చేస్తుంది. 12జీబీ ర్యామ్‌ను అందిస్తున్నార‌ని తెలుస్తోంది. ఇక మునుపటి లీక్‌లు మరియు కంపెనీ షేర్ చేసిన స్పెసిఫికేషన్‌లను ప‌రిశీలిస్తే.. రియ‌ల్‌మీ 12 ప్రో+ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల కర్వ్డ్ AMOLED ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని అంచ‌నా వేస్తున్నారు.(Realme 12 Pro+)

Realme 12 Pro+ Key Specifications Leaked Ahead of Launch

రియ‌ల్‌మీ 12 ప్రో+ యొక్క అధికారిక ఫ్రోటోలు ఈ స్మార్ట్‌ఫోన్‌కు వృత్తాకార మాడ్యూల్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ లభిస్తుందని స్ప‌ష్ట‌మైంది. రెండు కెమెరాలు OISతో 50-మెగాపిక్సెల్ సోనీ IMX890 ప్రైమరీ షూటర్ మరియు 120x జూమ్ సామర్థ్యాలతో 64-మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్‌గా ఉండవచ్చ‌ని భావిస్తున్నారు. మూడో కెమెరా వివరాలు మాత్రం తెలియరాలేదు. సెల్ఫీ మ‌రియు వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రెంట్ ఫేసింగ్ కెమెరా ఉండొచ్చ‌ని అంటున్నారు. 67W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో మద్దతునిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 14-ఆధారిత Realme UI 5తో ర‌న్ అవుతుంది. మొత్తానికి అద‌ర‌హో అనిపించేలా స్పెసిఫికేష‌న్స్ ఉండ‌టంతో రియ‌ల్‌మీ 12 ప్రో+ కోసం స్మార్ట్‌ఫోన్ ల‌వ‌ర్స్ ఎంతో ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు.

Join WhatsApp