Get Realme 12 Pro Plus Mobile At Rs.7,000 On Flipkart

Realme 12 Pro Plus: మన ఇండియన్ మార్కెట్లో రకరకాల మొబైల్ ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి. అలాగే ఈ మొబైల్ ఫోన్లు తక్కువ ధరకు కూడా లభిస్తున్నాయి. మంచి ఫీచర్లతో పాటు తక్కువ ధరలో ఈ మొబైల్ ఫోన్స్ మనకు లభించడం చూస్తూ ఉన్నాం. పండుగ వచ్చిన రాకున్నా ఏదో ఒక ఆఫర్లు పెడుతున్నాయి మొబైల్ కంపెనీలు. అయితే… తక్కువ ధరలో మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వారికి రియల్ మీ తాజాగా అదిరిపోయే శుభవార్త చెప్పింది. Realme 12 Pro Plus

Get Realme 12 Pro Plus Mobile At Rs.7,000 On Flipkart

ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఇటీవలే మార్కెట్లో లాంచ్ చేసిన రియల్ మీ 12 ప్రో సిరీస్ మొబైల్ ఫోన్స్ ఫిబ్రవరి 6వ తేదీ నుంచి విక్రయాలు జరుపుకొనున్నాయి. ఈ నేపథ్యంలో రియల్ మీ కంపెనీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. వాస్తవానికి రియల్ మీ 12 ప్రో ప్లస్ మొబైల్ ఫోన్ మన ఇండియన్ మార్కెట్లో… 35, 999 రూపాయలకు వస్తోంది.

Also Read: Xiaomi 14 Ultra: షావోమీ నుంచి న్యూ ఫోన్..5,180mah బ్యాటరీ..!

అయితే ఫ్లిప్కార్ట్ ద్వారా మనం ఈ మొబైల్ ఫోన్ కొనుగోలు చేస్తే డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్కార్ట్ ఈ కామర్స్ లో… మనం ఈ మొబైల్ ఫోన్ కొంటే దాదాపు 11 శాతం డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన మనకు ఈ మొబైల్ ఫోన్ 31,999 రూపాయలకు వస్తుంది. అంటే మనం ఈ మొబైల్ ఫోన్ కొనుగోలు చేస్తే దాదాపు 5 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు మనం వినియోగించినట్లయితే దాదాపు 1500 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇతర కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే కాస్త తక్కువ డిస్కౌంట్ వచ్చినప్పటికీ డిస్కౌంట్ మాత్రం వస్తుంది. ఇక… ఫిబ్రవరి 6వ తేదీ తర్వాత ఈ మొబైల్ కొనుగోలు చేసేవారు రెడీగా ఉండాలి అని కంపెనీ వెల్లడించింది.Realme 12 Pro Plus

Join WhatsApp