Realme Narzo 70 Pro 5G India launch confirmed for March

Realme Narzo 70 Pro 5G: నార్జో సిరీస్‌లో రియ‌ల్‌మీ నుంచి మ‌రో కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. అదే రియ‌ల్‌మీ నార్జో 70 ప్రో 5జీ(Realme Narzo 70 Pro 5G). గ‌త సంవత్సరం విడుద‌లైన రియ‌ల్‌మీ నారో 60 ప్రో యొక్క వార‌సుడిగా ఇది రాబోతోంది. 2024 మార్చిలో రియ‌ల్‌మీ నార్జో 70 ప్రో 5జీ లాంచ్ చేయబడుతుందని కంపెనీ ధృవీకరించింది. ఖచ్చితమైన తేదీ ఇంకా వెల్లడి కాలేదు. అయితే ఈ హ్యాండ్‌సెట్ కు సంబంధించిన కంపెనీ వెబ్‌సైట్‌లో ప్రత్యేకమైన మైక్రోసైట్ కూడా ఉంది. ఇది ఫోన్ యొక్క కొన్ని కీలక వివరాలను వెల్లడిస్తుంది.

Realme Narzo 70 Pro 5G India launch confirmed for March

మైక్రోసైట్ ఆధారంగా.. రాబోయే నార్జో 70 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ లో ట్రిపుల్ కెమెరా సెన్సార్లు మరియు LED ఫ్లాష్ ఉన్నాయి. ప్రాథమిక కెమెరా కోసం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మ‌ద్ద‌తుతో 50-మెగాపిక్సెల్ సోనీ IMX890 సెన్సార్ ఉంటుంద‌ని ధృవీకరించ‌బ‌డింది. ఇటీవలే ప్రారంభించబడిన రియల్‌మీ 12 ప్రో+లో కూడా OISతో కూడిన IMX890 సెన్సార్ మరియు మ్యాట్రిక్స్ కెమెరా అమరికతో ట్రిపుల్ రియర్ కెమెరాలు ఉన్నాయి.

డిజైన్ కూడా రియ‌ల్ మీ 12+ మోడల్‌ని పోలి ఉంటుంది. కాబట్టి నార్జో 70 ప్రో రియల్‌మీ 12 ప్రో+కి రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చు. అయితే నార్జో 70 ప్రోలో పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నట్లు కనిపించడం లేదు. కాబట్టి ఇతర సెన్సార్‌లకు కొన్ని మార్పులు ఉండవచ్చు. అలాగే ఈ ఫోన్ తక్కువ బ్రైట్‌నెస్‌లో కూడా ఆకట్టుకునే చిత్రాలను క్లిక్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.(Realme Narzo 70 Pro 5G)

Also Read: iQoo Neo 9 Pro: ఇండియాలో లాంచ్ అయిన ఐకూ నియో 9 ప్రో.. స్పెసిఫికేష‌న్స్‌, ధ‌ర వివ‌రాలు ఇవే!

ఇక స్పెసిఫికేష‌న్స్ విష‌యానికి వ‌స్తే.. 120Hz రిఫ్రెష్ రేటుతో 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ కర్వ్డ్ AMOLED స్క్రీన్ క‌లిగి ఉండొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. అలాగే స్నాప్‌డ్రాగన్ 7s జెస్ 2 SoC ప్రాసెస‌ర్ తో రియ‌ల్‌మీ నార్జో 70 ప్రో రావొచ్చు. 12జీబీ వ‌ర‌కు ర్యామ్ మ‌రియు 67W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 5000mAh బ్యాటరీని ఆశించవచ్చు. ఇక మరిన్ని వివరాలు త్వరలోనే బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. లాంచ్ తర్వాత ఈ ఫోన్ రియల్‌మీ.కామ్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్‌లతో పాటు అమెజాన్.ఇన్‌లో విక్రయించబడుతుంది.

Join WhatsApp