Realme Narzo 70 Pro 5G Launched in India

Realme Narzo 70 Pro 5G: ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జం రియ‌ల్‌మీ నుంచి నేడు ఇండియాలోకి ఓ కొత్త స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ ఇచ్చింది. అదే రియ‌ల్‌మీ నార్జో 70 ప్రో 5జీ(Realme Narzo 70 Pro 5G). ఆక‌ట్టుకునే ఫీచ‌ర్స్ తో రియ‌ల్‌మీ ఈ ఫోన్‌ను ప‌రిచ‌యం చేసింది. ఈ ఫోన్‌లోని AMOLED డిస్‌ప్లే రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్‌తో వస్తుంది. ఇది తడి చేతితో కూడా ఫోన్‌ను ఆపరేట్ చేయడానికి యూజ‌ర్ల‌ను అనుమతిస్తుంది. అలాగే ఈ హ్యాండ్‌సెట్‌ డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌తో వచ్చే హారిజన్ గ్లాస్ డిజైన్‌ను కలిగి ఉంది. రియ‌ల్‌మీ నార్జో 70 ప్రో 5జీ స్పెసిఫికేష‌న్స్ మ‌రియు ధ‌ర వివ‌రాల‌ను ప‌రిశీలిస్తే..

Realme Narzo 70 Pro 5G Launched in India

రియ‌ల్‌మీ నార్జో 70 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ 120Hz రిఫ్రెష్ రేట్, 2,200Hz టచ్ శాంప్లింగ్ రేట్ మరియు 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో 6.67-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను క‌లిగి ఉంది. Mali-G68 GPUతో జత చేయబడిన ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 SoC చిప్‌సెట్ ను ఈ ప‌రిక‌రంలో అందించారు. అలాగే ఆండ్రాయిడ్ 14-ఆధారిత Realme UI 5.1తో ఈ ఫోన్‌ నడుస్తుంది. ఇది మూడు సంవత్సరాల సాఫ్ట్‌వేర్ మరియు రెండు సంవత్సరాల ఓవర్-ది-ఎయిర్ సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుందని నిర్ధారించబడింది.

రియ‌ల్‌మీ నార్జో 70 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ మరియు 256GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ తో వస్తుంది. ర్యామ్ ను వర్చువల్‌గా 16GB వరకు విస్తరించవచ్చు. ఫోటోగ్రఫీ విభాగంలో ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్ ను క‌లిగి ఉంది. అందులో 50MP Sony IMX890 ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2MP మాక్రో సెన్సార్ ఉంటాయి. 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. మ‌రియు 67W వైర్డ్ SuperVOOC ఛార్జింగ్ స‌పోర్ట్ తో 5,000mAh బ్యాటరీని ఈ ప‌రిక‌రంలో అందించారు.(Realme Narzo 70 Pro 5G)

Also Read: Vivo T3 5G: మార్చి 21న ఇండియాకు రాబోతున్న వివో టీ3 5జీ.. ధ‌ర ఎంత ఉండొచ్చంటే?

గ్లాస్ గ్రీన్ మరియు గ్లాస్ గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్ ల‌భ్య‌మ‌వుతుంది. ఇండియాలో రియ‌ల్‌మీ నార్జో 70 ప్రో 5జీ బేస్ వేరియంట్‌ 8GB + 128GB రూ. 18,999 ధ‌ర‌తో ప్రారంభించ‌బ‌డింది. అలాగే 8GB + 256GB వేరియంట్ ధర రూ. 19,999గా నిర్ణ‌యించారు. మార్చి 22 మధ్యాహ్నం 12 గంటలకు ఆమెజాన్‌ మరియు రియ‌ల్‌మీ ఇండియా వెబ్‌సైట్ ద్వారా దేశంలో కొనుగోలు చేయడానికి ఫోన్ అందుబాటులో ఉంటుంది.

Join WhatsApp