Realme narzo 70x: మార్కెట్లోకి రోజు రోజుకు కొత్త ఫోన్స్ వస్తూ ఉంటాయి చైనా కి చెందిన స్మార్ట్ ఫోన్ రియల్ మీ భారత్ మార్కెట్లోకి కొత్త ఫోన్లు లాంచ్ చేస్తూ వుంది. తాజాగా రియల్ మీ నార్జో 17 ఎక్స్ పేరుతో అదిరిపోయే ఫోన్ ని తీసుకు రానుంది. రియల్ మీ నార్జో 17 సిరీస్ లో భాగంగా 17 తో పాటుగా 17 ఎక్స్ పేరుతో కొత్త ఫోన్ని లాంచ్ చేస్తోంది. ఇక ఈ ఫోన్ కి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడే చూద్దాం.. ఈ ఫోన్ 120 హెడ్స్ రిఫ్రెష్ రేటు అలానే 240 టచ్ సాంప్లింగ్ రేట్ తో కూడిన 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ స్క్రీన్ ని అందించారు. 1080×2400 పిక్సెల్స్ స్క్రీన్‌ ని ఇది కలిగి వుంది.

Realme narzo 70x phone full details

ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6100 + ఎస్వోసీ విత్ ఆర్మ్ మాలి-జీ57 జీపీయూ ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఇది ఇలా ఉంటే డైమనిక్ ర్యామ్ ఫీచర్‌కు సపోర్ట్‌ చేస్తుంది ఇది. ఇక ఈ ఫోన్ కెమెరా విషయానికొస్తే… ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇచ్చారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 8 మెగా పిక్సెల్స్‌ తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. అలానే బ్యాటరీ వార్నింగ్స్, చార్జింగ్ స్టేటస్ కోసం మినీ క్యాప్సూల్ 2.0 ఇచ్చారు.

Also read: Pavan Kalyan: తాటతీసి మోకాళ్ళ మీద నడిపిస్తాం.. పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..!

అలానే సెక్యూరిటీ కోసం బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ని కూడా ఇచ్చారు. ఈ ఫోన్ కి 128 జీబీ స్టోరేజీ కెపాసిటీ ని ఇచ్చారు. 2 టిగా బైట్స్‌ వరకు మెమోరీని కావాలంటే ఎక్స్టెండ్ చెయ్యవాచ్చు. ఇందులో 45 వాట్స్‌ సూపర్ వూక్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు (Realme narzo 70x).

Join WhatsApp