Redmi 12A: New phone under 15 thousand

Redmi 12A: ప్రస్తుతం మార్కెట్ లో అనేక మొబైల్స్ వస్తున్నాయి. ఇదే తరుణంలో రెడ్మి 12ఏ మొబైల్ కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ మొబైల్ తక్కువ బడ్జెట్ ఎక్కువ ఫీచర్స్ ను అందిస్తున్నది. దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.. రెడ్మీ 12 ఇమ్మార్సివ్ అమోలేడ్ డిస్ప్లే , 1200 నీట్ల ప్రకాశంతో మన ముందుకు వచ్చింది. ఈ మొబైల్ మూవీస్ చూడడానికి అయినా గేమ్స్ ఆడుకోవడానికైనా అద్భుతమైన డిస్ప్లేను కలిగి ఉంది.

Redmi 12A: New phone under 15 thousand

ఈ మొబైల్ కెమెరా విషయానికి వస్తే 50ఎంపీ ప్రైమరీ లెన్స్, 8 ఎంపీ అల్ట్రా వైల్డ్ లెన్స్, అలాగే 2ఎంపీ డెప్త్ సెన్సార్ తో పోయిన త్రిబుల్ కెమెరా సెట్ అప్ కలిగి ఉంది. అంతేకాకుండా రెడ్మి 12 అద్భుతమైన ఫోటోలు, వీడియోలను సులభంగా క్యాప్చర్ చేయగలరు. అదనంగా 8ఎంపీ సెల్ఫీ కెమెరాతో పాటు కచ్చితంగా సెల్ఫీలను తీయవచ్చు. (Redmi 12A)

Also Read: Vivo Y 100t: వివో నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్..64 ఎంపీ కెమెరా..!

ఈ మొబైల్ ఆక్టా కోర్ మీడియా టెక్ హీలియో G 88 ప్రాసెసర్ మరియు ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంతో మన ముందుకు వస్తోంది. అలాగే ఇది 4జీబీ, 6జీబీ, 8gb ర్యామ్ 128, 256 జిబి వరకు స్టోరేజ్ ఆప్షన్స్ లో లభిస్తున్నది. ఈ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో మనకు లభిస్తోంది.

Redmi 12A: New phone under 15 thousand

అంతేకాకుండా అద్భుతమైన డిజైన్ అనేక రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్ పోలార్ సిల్వర్, మూన్ స్టోన్ సిల్వర్, స్కై బ్లూ, మిడ్ నైట్ బ్లాక్ కలర్లలో ఉంది. ఇక ఈ మొబైల్ ధర విషయానికొస్తే రెడ్మీ 12 ఏ ధర రూ:10వేల నుంచి 15 వేల వరకు ఉండవచ్చని తెలుస్తోంది.(Redmi 12A)

Join WhatsApp