Samsung Galaxy F15 5G India Launch Set for March 4

Samsung Galaxy F15 5G: మన ఇండియన్ మార్కెట్లో అనేక రకాల స్మార్ట్ ఫోన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా… ప్రతి ఒక్కరి దగ్గర కచ్చితంగా స్మార్ట్ ఫోన్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ లేకపోతే మనిషి బయట అడుగు పెట్టడం లేదు. మనుషుల కంటే ఎక్కువగా ఫోన్లు అయిపోయాయి. ఒక్కొక్కరి దగ్గర రెండుకు మించిన ఫోన్లు కూడా ఉన్నాయి. తక్కువ ధరలో మంచి ఫ్యూచర్ లు ఉన్న మొబైల్ ఫోన్స్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. దీంతో… చాలామంది మొబైల్ ఫోన్లు విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు.Samsung Galaxy F15 5G

Samsung Galaxy F15 5G India Launch Set for March 4

దీనికి తగ్గట్టుగానే కంపెనీలు కూడా తక్కువ ధరలో మంచి ఫ్యూచర్స్ ఉన్న మొబైల్ ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. అయితే తాజాగా దక్షిణ కొరియా దేశానికి చెందిన ఎలక్ట్రానిక్ కంపెనీ సాంసంగ్ కీలక ప్రకటన చేసింది. ఇండియాలో సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది సాంసంగ్ కంపెనీ. అతి త్వరలోనే సాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 15 అనే మొబైల్ ను ఇండియాలో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇది కూడా ఫైవ్ జి హ్యాండ్ సెట్ ఉన్న ఫోన్.Samsung Galaxy F15 5G

Also Read: Samsung Galaxy Book 4: సామ్‌సంగ్‌ నుంచి కొత్త ల్యాప్‌టాప్‌..ధర, ఫీచర్స్‌ ఇవే !

మార్చి 4వ తేదీన ఈ మొబైల్ ఫోన్లో లాంచ్ చేసే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. సాంసంగ్ గెలాక్సీ ఫోన్ మూడు కలర్స్ లో మనకు లభిస్తుంది. అంతేకాకుండా ఈ కొత్త మొబైల్ లో అమేఎల్ఈడి డిస్ప్లే కూడా ఉంటుందట. ఇక ఈ మొబైల్ బ్యాటరీ వచ్చేసి 6000 mah సామర్థ్యం ఉంటుంది. 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కేబుల్ కు ఈ మొబైల్ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.Samsung Galaxy F15 5G

సాంసంగ్ నుంచి కొత్తగా రిలీజ్ కాబోతున్న ఈ సాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 15 మొబైల్ ఫోన్లలో నాలుగు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ అలాగే ఐదు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తుంది. ఇక ఈ శాంసంగ్ మొబైల్ ఫోన్… ఒకసారి ఫుల్ చార్జింగ్ పెడితే రెండు రోజులపాటు మనకు లైఫ్ ఇస్తుంది. ఈ మొబైలు బ్యాక్ కెమెరా 50 మెగా fixel. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 15 ధర 15 వేల రూపాయల లోపు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.Samsung Galaxy F15 5G

Join WhatsApp