Samsung Galaxy Fit 3 Launched in India

Samsung Galaxy Fit 3: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ రీసెంట్ గా ఓ క్రేజీ ఫిట్‌నెస్ ట్రాక‌ర్ ను లాంచ్ చేసింది. అదే శాంసంగ్ గెలాక్సీ ఫిట్ 3(Samsung Galaxy Fit 3). ఇది 2020లో ప్రారంభించబడిన గెలాక్సీ ఫిట్ 2కి వార‌సుడిగా వ‌స్తోంది. ప్ర‌స్తుత రోజుల్లో ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ వ‌హిస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. త‌మ హెల్త్ గురించి డీప్‌గా తెలుసుకునేందుకు మ‌క్కువ చూపుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే అడ్వాన్స్​డ్​ హెల్త్​ మానిటరింగ్​ టూల్స్​ని అందిస్తూ ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో గెలాక్సీ ఫిట్ 3ను శాంసంగ్ ప‌రిచ‌యం చేసింది.

Samsung Galaxy Fit 3 Launched in India

భారతదేశంతో సహా ఎంపిక చేసిన మార్కెట్‌లలో ఫిబ్రవరి 23 నుండి కొనుగోలు చేయడానికి ఈ ఫిట్‌నెస్ ట్రాక‌ర్ అందుబాటులోకి వ‌చ్చింది. శాంసంగ్ గెలాక్సీ ఫిట్ 3 ఫిట్​నెస్​ ట్రాకర్ 256 x 402 రిజల్యూషన్ తో 1.6-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో అల్యూమినియం బాడీని కలిగి ఉంది. ఇది గెలాక్సీ ఫిట్ 2తో పోలిస్తే 45 శాతం వెడల్పుగా ఉంటుంది. FreeRTOSలో ఇది నడుస్తుంది. ఈ ఫిట్‌నెస్ ట్రాకర్ వినియోగదారులను ఒక-క్లిక్ రిలీజ్ మెకానిజంతో సులభంగా బ్యాండ్‌లను మార్చడానికి అనుమతిస్తుంది.

అలాగే ఈ ప‌రిక‌రంలో 100కుపైగా వర్కౌట్​ టైప్స్​, స్నోరింగ్​ డిటెక్షన్​, హార్ట్‌​ రేట్​- స్ట్రెస్​ లెవల్స్​ మానిటర్, బ్లడ్​ ఆక్సీజన్​ లెవల్స్​ కోసం అడ్వాన్స్​డ్​ స్లీప్​ మానిటరింగ్​ టూల్స్​ ఉన్నాయి. వినియోగదారులకు వారి నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి పర్సనలైజ్​డ్​ స్లీప్​ కోచింగ్ ఫీచర్​ ను కూడా ఇందులో అందిస్తున్నారు. ఈ ఫిట్‌నెస్ ట్రాక్ లో 208ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. కేవ‌లం 30 నిమిషాల్లో 65శాతం ఛార్జ్ చేయ‌గ‌ల‌దు. మ‌రియు సింగిల్ ఛార్జ్ తో ​13 రోజులు​ బ్యాటరీ లైఫ్​ అందిస్తోంది.(Samsung Galaxy Fit 3)

Also Read: Realme Narzo 70 Pro 5G: నార్జో సిరీస్‌లో రియ‌ల్‌మీ నుంచి వ‌స్తున్న మ‌రో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. వివ‌రాలు ఇవే!

అంతేకాదండోయ్‌.. శాంసంగ్ గెలాక్సీ ఫిట్ 3లో ఫాల్​ డిటెక్షన్​, ఎమర్జెన్సీ ఎస్​ఓఎస్​ వంటి సేఫ్టీ ఫీచర్స్​ ఉన్నాయి. అలాగే ఈ ప‌రిక‌రం 16MB ర్యామ్ మరియు 256MB స్టోరేజ్ తో జత చేయబడుతుంది. బ్లూటూత్​ 5.3 కనెక్టివిటీ ఫీచర్ దీనిలో ఉంది. పైగా టైమర్‌లను సెట్ చేయడానికి, ఫోటోలు తీయడానికి మరియు మీడియా ప్లేయర్ సెట్టింగ్‌లను నియంత్రించడానికి ఈ ట్రాకర్‌ను వారి గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లకు రిమోట్ కంట్రోల్‌గా కూడా యూత్ చేయ‌వ‌చ్చు. ఈ ఫిట్‌నెస్ ట్రాకర్‌ 5ATM IP68 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ రేటును క‌లిగి ఉంది. ఇక ధ‌ర విష‌యానికి వ‌స్తే.. శాంసంగ్ గెలాక్సీ ఫిట్ 3 రూ. 4,999తో ప్రారంభించ‌బ‌డింది. గ్రే, సిల్వర్ మరియు పింక్ గోల్డ్ అనే మూడు క‌ల‌ర్స్ లో ఈ ప‌రిక‌రం అందుబాటులో ఉంది.

Join WhatsApp