Smart Yoga Mat : ఈ రోజుల్లో అంతా టెక్నాలజీ ఏ నడుస్తోంది ప్రతి ఒక్కరూ కూడా టెక్నాలజీకి బాగా అలవాటు పడిపోయారు. చాలా రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా వచ్చేసాయి. ఇదిలా ఉంటే ప్రతిరోజు ఫీట్ గా హెల్తీగా ఉండాలని చాలామంది యోగ చేస్తూ వుంటారు. మీరు కూడా యోగ చేస్తున్నారా..? అయితే కచ్చితంగా ఈ స్మార్ట్ మ్యాట్ గురించి చూడాలి. యోగ చేసే వాళ్ళకి స్మార్ట్ మ్యాట్ బాగా ఉపయోగపడుతుంది. అసలు ఈ స్మార్ట్ మాట్ ఏంటి దీని వలన ఉపయోగం ఏంటి అనే విషయాలని ఇప్పుడు చూద్దాం.

Smart Yoga Mat super features

ఇప్పుడు అంతా కూడా స్మార్ట్ టీవీ స్మార్ట్ ట్యాబ్ స్మార్ట్ వాచ్ ఇలా ప్రతిదీ కూడా స్మార్ట్ అయిపోయింది. స్మార్ట్ జనరేషన్ లో ఇది అసలు ఊహించి ఉండరు. స్మార్ట్ యోగ మ్యాట్ కూడా వచ్చింది. యోగ మ్యాట్ లో స్మార్ట్ ఏంటి అని ఆలోచిస్తున్నారా…? ఇది నిజంగా హై టెక్నాలజీ మామూలు యోగ మ్యాట్ లానే కింద వేసుకుని దీని మీద యోగ చేయొచ్చు కానీ ఈ స్మార్ట్ మ్యాట్ మీతో మాట్లాడుతుంది. ఇంట్లో ఉన్న వైఫై కి ఇది కనెక్ట్ చేస్తే మాట్లాడడమే కాదు మీతో సరిగా యోగా కూడా చేస్తుంది. వైఫై ద్వారా మీ స్మార్ట్ టీవీకి కూడా కనెక్ట్ చేయొచ్చు టీవీ లో చూస్తూ యోగాసనాలు నేర్చుకుంటున్నట్లయితే మీరు చేస్తున్న ఆసనాలు గురించి సూచనలను ఇస్తుంది.

Also read: Mahesh Babu: చిన్న కారణంతో ఏడాదిన్నర ఆడిన సినిమాని రిజెక్ట్ చేసిన మహేష్ బాబు..!

ఒకవేళ ఆసనాలు తప్పుగా వేస్తే అది మిమ్మల్ని ఇన్స్ట్రక్ట్ చేస్తుంది అంతేకాకుండా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కౌంటింగ్ కూడా చేస్తుంది. ప్రాణాయామ చేస్తున్నప్పుడు శ్వాస ఎప్పుడు పీల్చుకోవాలి ఎప్పుడు వదిలేయాలి అనే విషయాన్ని కూడా చెప్తుంది. ప్రతిరోజు బీఎంఐ చెక్ చేస్తుంది బరువు ఫ్యాట్ ఉండాల్సిన బరువు వీటన్నిటిని కూడా చెప్తూ ఉంటుంది మీరు ఏమైనా గోల్స్ పెట్టుకుంటే దానికి అనుగుణంగా ఎన్ని ఆసనాలు ఎన్నిసార్లు వేయాలనేది ఆటోమేటిగ్గా లెక్కపెట్టి చెబుతుంది. వారానికి ఒకసారి దీనికి చార్జింగ్ పెడితే సరిపోతుంది (Smart Yoga Mat).

Join WhatsApp