spotify: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ యూట్యూబ్ కి ప్రపంచవ్యాప్తంగా మామూలు క్రేజ్ ఉండదు ఈ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా లేదు. వీడియో కంటెంట్ యూట్యూబ్ కి ఇప్పుడు స్ఫోటిఫై పోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది మామూలుగా స్ఫోటిఫై ఆడియో స్ట్రీమింగ్ కి మాత్రమే పరిమితం అయ్యింది కానీ ఇప్పుడు వీడియోలు కూడా స్ట్రీమింగ్ ఫీచర్ ని తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది ప్రముఖ మ్యూజిక్ ప్లాట్ఫామ్ స్ఫోటిఫై యూజర్లన్ని పెంచుకోవాలని మరో అడుగు ముందుకు వేస్తోంది ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసేద్దాం. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా చూసేయండి ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్స్ స్ఫోటిఫై యూజర్ లని పెంచుకోవాలని అడుగులు వేస్తోంది.

spotify New Feature

అందుకని యూట్యూబ్ కి పోటీగా కొత్త సేవలను తీసుకువచ్చే పనిలో పడింది ఇప్పటివరకు కేవలం మ్యూజిక్ స్ట్రీమింగ్ కి మాత్రమే పరిమితమైన స్ఫోటిఫై ఇప్పుడు మ్యూజిక్ వీడియోలను కూడా చూడడానికి వెసులుబాటు కల్పిస్తోంది. ఈ దిశగా స్ఫోటిఫై ఇప్పటికే వర్కౌట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మ్యూజిక్ వీడియో ఫీచర్ టెస్టింగ్ స్టేజ్ లో ఉంది త్వరలోనే యూజర్లకి అందుబాటులోకి రాబోతోంది.

Also read: children: పిల్లలు కావాలి అని అనుకునేవారు తినకూడని ఆహారాలు ఇవే..!

ఇప్పటికే కొత్త ఫీచర్ ని కొంతమంది ప్రీమియం బీటా వినియోగదారుల కోసం విడుదల చేశారు ఏమైనా లోపాలు ఉంటే సవరించి అందరూ యూజర్లకు అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ చూస్తోంది. అయితే దీనిలో కేవలం మ్యూజిక్ వీడియోలు మాత్రమే ప్లే అవుతాయని తెలుస్తోంది యూజర్ బేస్ ని పెంచుకోవడానికి స్ఫోటిఫై కృషి చేస్తోంది. దీనిలో భాగంగా 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల యూజర్ మార్క్ దాటాలని లక్ష్యంగా పెట్టుకుని అందుకని ఈ కొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది మరి స్ఫోటిఫై కి ఈ ఫీచర్ ఎంతలా హెల్ప్ అవుతుంది యూట్యూబ్ కి గట్టి పోటీని ఇస్తుందా లేదా అనేది చూద్దాం (spotify).

Join WhatsApp