Tech Layoffs 2024 US based Company Salesforce to Sack 700 Employees

Tech Layoffs 2024: కరోనా టైం లో మొదలైన ఉద్యోగులు తొలగింపులు ఇప్పుడు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే కొత్త ఏడాది 2024 లో అయినా సరే పరిస్థితులు సర్దుకుంటాయని అంతా భావించారు. కానీ అలా కుదరలేదు. ఇంకా టెక్, ఐటీ ఉద్యోగులకు ఊరట లభించడం లేదు. ఈ ఏడాది కూడా వరుస పెట్టి దిగ్గజ కంపెనీలు లేఆఫ్స్ ని ప్రకటిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలను చూస్తే.. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ లేఆఫ్స్ ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.

Tech Layoffs 2024 US based Company Salesforce to Sack 700 Employees

అయితే ఇక ఇప్పుడు అదే బాట లో ఇంకో టెక్ కంపెనీ ఉద్యోగులను తొలగించినట్లు వెల్లడించింది. ఆ వివరాలు చూస్తే.. అమెరికా క్లౌండ్ బేస్డ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ సేల్స్ ఫోర్స్ (SalesForce) లేఆఫ్స్ ని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా వున్నా తన కంపెనీ లో పనిచేస్తున్న సిబ్బందిలో 1 శాతం అంటే సుమారు 700 మందిపై వేటు వేసింది సేల్స్ ఫోర్స కంపెనీ.

Also Read: Salar: అమ్మ దీనమ్మ… సలార్ మూవీ మొత్తం ఆ స్టార్ ఫ్యామిలీ గురించే తీశారా.. పెద్ద ప్లానేగా (వీడియో) 

వాల్ స్ట్రీట్ జర్నల్ లో ఈ విషయాన్ని పేర్కొంది. గూగుల్, అమెజాన్, బెహెమాథ్స్ వంటి కంపెనీలు ఇప్పటికే లేఆఫ్స్ ని ప్రకటించాయి అని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఇది వరకు కూడా సేల్స్ ఫోర్స్ భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. 2023, సెప్టెంబర్ లో మొత్తం 10 శాతం మందిని తీసేసారు. అలానే కొన్ని ఆఫీసులను సైతం మూసి వేశారు. దానికి ముందు 2023, జనవరిలో వ్యయ నియంత్రణల పేరిట సుమారు 3000 మందిని తీసేసారు. ఇప్పుడు మళ్లీ 700 మందిని తొలగించడంతో ఆందోళన నెలకొంది. (Tech Layoffs 2024)

Join WhatsApp