Tech Tips to Find Mobile Number

Tech Tips: స్మార్ట్ ఫోన్ తో కూర్చుంటే సమయమే తెలియదు రోజంతా కూడా స్మార్ట్ ఫోన్ చూసుకుని గడిపేయొచ్చు. అస్సలు బోర్ కొట్టదు అయితే స్మార్ట్ ఫోన్ వలన ఒకరితో మాట్లాడడమే కాకుండా ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం సోషల్ మీడియా ఇటువంటి వాటికి మనం ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాము. అయితే చాలాసార్లు మనం మన మొబైల్ నెంబర్ ని మర్చిపోతుంటాం. ముఖ్యంగా నెంబర్లు మారుస్తున్న వాళ్ళు లేదంటే కొంచెం కష్టంగా నెంబరు ఉన్నట్లయితే మర్చిపోవడం జరుగుతుంటాయి.

Tech Tips to Find Mobile Number

ఒక్కొక్కసారి టెన్షన్ వలన కూడా నెంబర్ మర్చిపోతూ ఉంటాం అయితే మొబైల్ నెంబర్ ని ఎలా కనుక్కోవాలి..? మన నెంబర్ ని కనుక్కోవడానికి ఈజీగా ఈ టిప్ ని ఫాలో అయితే సరిపోతుంది ఈ టిప్ ద్వారా ఈజీగా మీ మొబైల్ నెంబర్ మర్చిపోయినప్పుడు మీరు వెంటనే పొందవచ్చు. ఇక మనం నెంబర్ మర్చిపోతే ఎలా దానిని పొందొచ్చు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

Also Read: Budget Session 2024: నేడు అఖిలపక్ష సమావేశానికి కేంద్రం పిలుపు..!

వేర్వేరు టెలికాం కంపెనీలు వేర్వేరు USSD కోడ్‌లను ఇస్తుంటాయి. వాటి ద్వారా మీరు మీ మొబైల్ నంబర్‌ను కనుగొనవచ్చు. ఎయిర్టెల్ కి *282, వోడాఫోన్ కి 1112# లేదా 5550# ఐడియా కి 1214# BSNL కి *99# అలానే జియో కి *1# ఈ USSD కోడ్‌లను డయల్ చేసిన తర్వాత మీ ముందు మెను ఓపెన్‌ అవుతుంది. మొబైల్ నంబర్ ఎంపికను ఎంచుకోండి. ఇప్పుడు మీ మొబైల్ నంబర్ ని మీ డిస్‌ప్లేలో చూడవచ్చు. (Tech Tips)

Join WhatsApp