Tecno Spark 20 India Launch Soon

Tecno Spark 20: మన ఇండియన్ మార్కెట్లో అనేక రకాల స్మార్ట్ ఫోన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత కాలంలో ఎక్కువగా ఫైవ్ జి మొబైల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. తక్కువ ధరలు అలాగే మంచి ఫీచర్స్ ఉన్న మొబైల్ ఫోన్స్ తరచూ లాంచ్ అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే మన ఇండియాలో సరికొత్త మొబైల్ లాంచ్ కాబోతుంది. టెక్నో కంపెనీ నుంచి మన ఇండియాలో సరికొత్త మొబైల్ ఫోన్ రాబోతుంది.

Tecno Spark 20 India Launch Soon

త్వరలోనే లంచ్ కాబోతున్న ఈ మొబైల్ ఫోన్ పేరు వచ్చేసి టెక్నో స్పార్క్ 20. ఇక ఈ మొబైల్ త్వరలోనే విక్రయానికి కూడా మార్కెట్లో లాంచ్ కాబోతుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది ఈ కంపెనీ. అంతేకాకుండా ఈ కామర్స్ సంస్థలు అయిన అమెజాన్ లాంటి వాటిలో అందుబాటులో ఉండనుంది. ఇక ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ మొబైల్ ధర పదివేల నుంచి 11,000 రూపాయల మధ్య ఉండే ఛాన్స్ ఉంది.

Also Read: Infinix Smart 8 Pro: తక్కువ ధరకే Infinix మొబైల్‌…ఫీచర్స్‌ ఇవే

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఒకసారి పరిశీలిద్దాం. ఈ స్మార్ట్ ఫోన్ సైజు 6.6 అంగుళాలు ఉంటుంది. ఈ మొబైల్కు ఉన్న రిఫ్రెష్ రేటు 90 hz అని కంపెనీ తెలిపింది. టెక్నోస్ పార్క్ 20 స్మార్ట్ ఫోన్ బ్యాక్ కెమెరా 50 మెగాపిక్సల్ గా ఉంది. అలాగే సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సల్ ఉంటుంది.

ఈ మొబైల్ ఫోన్కు వెనక మరియు ముందు భాగంలో ఫేసింగ్ కెమెరాలు రెండు ఎల్ఈడి ఫ్లాష్ కలిగి ఉంటాయి. ఇక ఈ మొబైల్ బ్యాటరీ సామర్థ్యం 5000 mah ఉంటుంది. అంతేకాకుండా సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైడ్ కు ఉంటుందని కంపెనీ వివరించింది. మార్కెట్లోకి రిలీజ్ కాగానే తమ వెబ్సైట్ ద్వారా కూడా ఈ మొబైల్ కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది టెక్నో కంపెనీ. (Tecno Spark 20)

Join WhatsApp