Tecno Spark 20 the latest mobile from Tecno

Tecno Spark 20: ప్రస్తుతం మొబైల్ మార్కెట్ లో టెక్నో కంపెనీ కూడా మంచి గుర్తింపు సాధించింది. ఈ కంపెనీకి చెందిన కొన్ని వేరియంట్లు ఇప్పటికే రిలీజ్ అయి మార్కెట్లో దూసుకుపోతున్నాయి. అలాంటి ఈ తరుణంలో టెక్నో స్పార్క్ 20 అనే మొబైల్ త్వరలో రిలీజ్ కు సిద్ధంగా ఉంది. మరి ఈ మొబైల్ కు సంబంధించిన ఫీచర్స్ ఇతర వివరాలు ఏంటో తెలుసుకుందాం..ఈ మొబైల్ హీలియో జి85 చిప్ తో వస్తోందట.

Tecno Spark 20 the Latest Mobile From Tecno

అయితే చౌక ధరలో అత్యధిక ఫీచర్లు కలిగినటువంటి ఫోన్లను తీసుకు వస్తున్నటువంటి వాటిలో టెక్నో సంస్థ మంచి గుర్తింపు సాధించింది . ఈ మొబైల్ ఇండియాలో ఫిబ్రవరి 2024 లో లాంచ్ అవ్వనిందని తాజా సమాచారం. ఇక ఈ మొబైల్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. 6.56 ఇంచెస్ హెచ్ డి ప్లస్ డిస్ప్లే,720*1612 పిక్సెల్స్ రిజల్యూషన్ కలిగి ఉంది. (Tecno Spark 20)

Also Read: Moto G54 5G: ఇండియాలో మోటో జీ54 5జీపై భారీ డిస్కౌంట్‌.. ఇప్ప‌టి ధ‌ర‌లు ఎంతంటే?

అంతేకాకుండా 90HZ రిఫ్రెష్ వస్తున్నటువంటి ఈ మొబైల్ 256 జీబీ వేరియంట్ ధర రూ:10వేలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఈ మొబైల్ మీడియా టెక్ హీలియో H85 చిప్ సెట్ కలిగి ఉంది. టెక్నో స్పార్క్ 20 8gb ర్యామ్ కలిగి ఉంటుందని, అలాగే 8gb ఎక్స్టెండెడ్ ర్యామ్, 256 జిబి స్టోరేజ్ ఆఫర్ చేయనుంది.

Tecno Spark 20: The latest mobile from Tecno

ఇక ఈ మొబైల్ కెమెరా విషయానికొస్తే డ్యూయల్ రియర్ కెమెరా సెట్ అప్ ,50 ఎంపీ ప్రైమరీ కెమెరా, అంతేకాకుండా వీడియో కాల్స్, సెల్ఫీ కోసం 32 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో రాబోతోందట. ఇక ఈ ఫోన్ బ్యాటరీ విషయానికొస్తే 5000 mah బ్యాటరీ,18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కలిగి ఉందట. (Tecno Spark 20)

Join WhatsApp