The Best Smartphones in the 15k Range

Best Smartphone: ప్ర‌స్తుత కాలంలో ప్ర‌పంచం మొత్తం అర‌చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లోనే ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ లేని ఇల్లు ఉండ‌టం లేదు. మీరు కూడా కొత్త‌ స్మార్ట్‌ఫోన్ కొనాల‌ని భావిస్తున్నారా..? అది కూడా తక్కువ బ‌డ్జెట్ ఫోన్ కోసం వెతుకున్నారా..? అయితే మీకోస‌మే రూ. 15 వేల‌లోపు రీసెంట్ గా లాంచ్ అయిన బెస్ట్ మొబైల్స్ ను ఇప్పుడు తీసుకొస్తున్నాము. కాబట్టి ఆందోళనను విడిచిపెట్టి.. దిగువ ఎంపికల నుండి మీకు ఇష్టమైనదాన్ని స్మార్ట్‌ఫోన్‌ను ఎంచుకోండి.

Lava Blaze Pro 5G: త‌క్కువ బడ్జెట్ తో ఫోన్ కొనాల‌ని భావించే వారికి లావా బ్లేజ్ ప్రో 5జీ ఉత్త‌మైమ‌న ఎంపిక. 120Hz రిఫ్రెష్ రేటుతో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఈ ఫోన్ క‌లిగి ఉంది. శక్తివంతమైన డైమెన్సిటీ 6020 చిప్ సెట్ ఇందులో ఉంటుంది.33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన భారీ 5,000ఎమ్ఏహెచ్‌ బ్యాటరీ, 50 ఎంపీ రేర్ కెమెరా సెట‌ప్ ఈ ఫోన్ సొంతం. ధ‌ర విష‌యానికి వ‌స్తే.. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ తో ప్యాక్ చేయ‌బ‌డిన లావా బ్లేజ్ ప్రో 5జీ ఫోన్‌ని మీరు రూ. 13,499కే కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Tecno Pova 5 Pro 5G: ఇటీవ‌ల లాంచ్ అయిన బెస్ట్ ఫోన్ టెక్నో పోవ 5 ప్రో 5జీ. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ వ‌చ్చింది. మీరు బ్రౌజింగ్ చేసినా, గేమింగ్ చేసినా లేదా మల్టీ టాస్కింగ్ చేసినా సున్నితమైన పనితీరును నిర్ధారిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల డిస్‌ప్లే ఈ ఫోన్‌లో ఉంటుంది. 50ఎంపీ డ్యూయల్ కెమెరా, 68వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌తో భారీ 5000ఎమ్ఏహెచ్‌ బ్యాటరీని ఈ గ‌డ్జెట్ కలిగి ఉంది. 8జీబీ ర్యామ్‌, 256జీబీ వ‌ర‌కు ఇంట్ర‌ర్న‌ల్ స్టోరేజ్‌తో టెక్నో పోవ 5 ప్రో 5జీ వ‌చ్చింది. ఈ ఫోన్ ధ‌ర రూ. 14,999.

Samsung Galaxy M14 5G: 6,000ఎమ్ఏహెచ్ సామ‌ర్థం గ‌ల భారీ బ్యాట‌రీతో ఇటీవ‌ల లాంచ్ అయిన మ‌రో క్రేజీ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎమ్‌14 5జీ. 6.6 అంగుళాల డిస్ ప్లేను క‌లిగి ఉన్న ఈ ఫోన్‌లో శక్తివంతమైన ఎక్సినోస్ 1330 ఆక్టా కోర్ 2.4GH 5nm ప్రాసెసర్ అమ‌ర్చారు. 50ఎంపీ ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌, 13ఎంపీ ఫ్రెంట్ కెమెరాను ఇచ్చారు. ఇక 6జీబీ వ‌ర‌కు ర్యామ్‌, 128 జీబీ వ‌ర‌కు స్టోరేజ్ తో బిల్డ్ చేయబ‌డిన శాంసంగ్ గెలాక్సీ ఎమ్‌14 5జీ ఫోన్ ధ‌ర రూ. 14,333.

Also Read: Redmi Note 12: రెడ్‌మీ నోట్ 12పై భారీ డిస్కౌంట్‌.. డెడ్ చీప్ ధ‌ర‌కే క్రేజీ స్మార్ట్‌ఫోన్‌!

Realme 11x 5G: ఇటీవ‌ల లాంచ్ అయిన మ‌రో బ‌డ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ రియ‌ల్‌మీ 11ఎక్స్ 5జీ. 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లే క‌లిగి ఉన్న ఈ ఫోన్ లో డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ ను అందించారు. 64ఎంపీ డ్యూయ‌ల్ కెమెరా సెట‌ప్‌, 5000ఎమ్ఏహెచ్‌ బ్యాటరీతో ఈ ఫోన్ వ‌చ్చింది. 8జీబీ వ‌ర‌కు ర్యామ్‌, 128జీబీ వ‌ర‌కు స్టోరేజ్ తో ప్యాక్ చేయ‌బ‌డిన ఈ ఫోన్ ధ‌ర రూ. 14,999. Best Smartphone

Join WhatsApp