Rogbid Model A: The latest smart watch from Rogbid

Rogbid Model A: ప్రస్తుతం మార్కెట్ లోకి అనేక స్మార్ట్ వాచ్ లు వస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రోగ్ బీడ్ మోడల్. ఈ స్మార్ట్ వాచ్ అత్యాధునికమైన ఫీచర్లతో మన ముందుకు రాబోతోంది. ఈ వాచ్ యొక్క ఫీచర్లు ఇతర వివరాలు చూసేద్దామా.. రోగ్ బిడ్ నుండి వచ్చిన కొత్త మోడల్ ఏ స్మార్ట్ ఆండ్రాయిడ్ ఆధారిత వాచ్ వీడియో కాల్స్ కోసం హెచ్ డీ, కెమెరాను కూడా కలిగి ఉందట.

The Latest Rogbid Model A Smart Watch From Rogbid

అంతేకాకుండా రక్తపోటుకు సంబంధించినటువంటి వాటిని కూడా పర్యవేక్షిస్తుందట. అలాగే ఈ స్మార్ట్ వాచ్ సిలికాన్ పట్టితో, నలుపు రంగులో లేదా బ్రౌన్ లెదర్ పట్టితో రాబోతోందట. వాచ్ కొనుగోలను ఇంకా ప్రారంభించలేదు. అలాగే ఈ స్మార్ట్ వాచ్ గుండె రేటు, రక్త ఆక్సిజన్ స్థాయిల యొక్క సాధారణ 24/7 పర్యవేక్షణ చేస్తుందట. (Rogbid Model A)

Also Read: Infinix Smart 8 Pro: తక్కువ ధరకే Infinix మొబైల్‌…ఫీచర్స్‌ ఇవే

అంతేకాకుండా వివిధ స్పోర్ట్స్ మోడల్ కూడా ఇందులో ఉన్నాయని తెలుస్తోంది. అలాగే జిపిఎస్ ద్వారా నావిగేషన్ గూగుల్ మ్యాప్స్ తో పాటు, గూగుల్ ప్లే, గూగుల్ యాప్ లను కూడా కలిగి ఉంటుంది. అలాగే వీడియో కాల్స్ కోసం 1.69 అంగుళాల ఆమోలెడ్ డిస్ప్లే , ఇంటిగ్రేడ్ చేయబడినటువంటి హెచ్డీ కెమెరా కలిగి ఉంటుంది.

Rogbid Model A: The latest smart watch from Rogbid

రోగ్ బిడ్ మోడల్ ఏ 800 ఎంఏహెచ్ బ్యాటరీ ,3+32gb స్టోరేజ్, wifi, 4g కనెక్టివిటీ బ్లూటూత్ కలిగి ఉందట. మ్యూజిక్ ప్లే బ్యాక్, ఫేషియల్ అన్ లాకింగ్ వీడియో ప్లేయర్ వంటి అనేక ఫీచర్లు కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా అన్ని రకాల ఫీచర్స్ కలిగినటువంటి ఈ వాచ్ వినియోగదారులకు ఎంతో నచ్చుతుందని తెలియజేస్తున్నారు.

Join WhatsApp