Upcoming Smartphones: మనదేశంలో స్మార్ట్ ఫోన్లకి డిమాండ్ ఎంత ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ఫోన్ ని వాడుతూ ఉంటారు ఎక్కువగా స్మార్ట్ఫోన్తోనే సమయాన్ని గడుపుతూ ఉంటారు. ఎప్పుడు ఏ కొత్త ఫోన్ లాంచ్ అయిన కూడా వాటి మీద ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. కొత్త ఫోన్ల కి సంబంధించిన అప్డేట్లని కూడా చాలా మంది తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉంటారు లాంచ్ కాబోతున్న ఫోన్లో కోసం చాలా మంది ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొన్ని టాప్ బ్రాండ్ల ఫోన్స్ వచ్చే నెల అంటే మార్చి లో మార్కెట్లోకి రావడానికి రెడీ అవుతున్నాయి. మరి మార్చిలో రాబోతున్న స్మార్ట్ ఫోన్ లకి సంబంధించిన వివరాలను ఇప్పుడే చూసేద్దాము.

Upcoming Smartphones in March

మార్చిలో రాబోతున్న స్మార్ట్ ఫోన్లలో పలు మోడల్స్ ఉన్నాయి ఆ మోడల్స్ కి సంబంధించిన వివరాలను కూడా ఇప్పుడే చూసేద్దాం. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా వీటిపై ఒక లుక్ వేసేయండి.. శామ్సంగ్ గెలాక్సీ ఏ55 5జీ మార్చి చివరి వారం లో లేదా ఏప్రిల్ మొదటి వారంలో మార్కెట్లోకి రాబోతోంది. ఇది 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.5-అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లే తో రాబోతోంది. ఫోన్ వెనుక భాగం లో ట్రిపుల్ కెమెరా మాడ్యూల్ ఉంటున్నట్టు తెలుస్తోంది. శామ్సంగ్ ఇన్ బిల్ట్ ఎక్సినోస్ 1480 ఎస్ఓసీ ఆధారంగా ఇది పనిచేస్తుంది. నథింగ్ ఫోన్ 2ఏ వక్జేసి మార్చి 5వ తేదీన మార్కెట్లోకి రానుంది.

Also read: Revanth Reddy: రేవంత్ రెడ్డి కి బీజేపీ కార్పొరేటర్ విజ్ఞప్తి..!

ఈ స్మార్ట్ ఫోన్లో 6.7-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే, డ్యూయల్-కెమెరా మాడ్యూల్ ని ఇచ్చారు. 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ మెమరీ తో వస్తోంది ఈ ఫోను. మీడియా టెక్ డైమెన్సిటీ 7200 ఎస్ఓసీలో ఇది రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఈ ఫోన్ వర్క్ అవుతుంది. నథింగ్ కంపెనీ నుంచి వస్తున్న చవకైన ఫోన్ ఇదే. అలానే వివో వీ30 ప్రో స్టాండర్డ్ వివో వీ30 విడుదల తర్వాత ఫోన్ ప్రో వేరియంట్ ఫిబ్రవరి 28న మార్కెట్లోకి రాబోతోంది. ఈ ఫోన్ కర్వ్ డ్ 3డీ డిస్‌ప్లే తో వస్తుంది. ట్రిపుల్ కెమెరా మాడ్యూల్‌ తో ప్రాథమిక 50-మెగాపిక్సెల్ సెన్సార్‌తో వస్తోంది ఈ ఫోన్. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్‌సెట్‌ తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పని చేస్తుంది (Upcoming Smartphones).

Join WhatsApp