Vivo T3 5G chipset and other details confirmed ahead of March 21 launch

Vivo T3 5G: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు భారతదేశంలో తన తదుపరి స్మార్ట్‌ఫోన్ లాంచ్ కోసం సిద్ధమవుతోంది. V30 సిరీస్‌ను ప్రారంభించిన కొద్ది రోజులకే కంపెనీ T-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను ప‌రిచ‌యం చేయ‌బోతోంది. వివో టీ3 5జీ స్మార్ట్‌ఫోన్ మార్చి 12న ఇండియాలో లాంచ్ కాబోతోంద‌ని ధృవీకరించబ‌డింది. క్లాస్ కెమెరా మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్లలో ఈ హ్యాండ్‌సెట్ వ‌స్తోంది. లాంచ్‌కు ముందు కంపెనీ రాబోయే స్మార్ట్‌ఫోన్ గురించి ముఖ్యమైన వివరాలను వెల్లడించింది.

Vivo T3 5G chipset and other details confirmed ahead of March 21 launch

వివో టీ3 5జీ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్‌తో అందించబడుతుందని క‌న్ఫార్మ్ చేశారు. డైమెన్సిటీ 7200 SoC 4nm ప్రాసెస్‌లో రూపొందించబడింది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ 8GB+256GB వేరియంట్‌తో AnTuTu V10 బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫారమ్‌లో 7,34,000 పాయింట్లకు పైగా స్కోర్ చేసింది. రూ. 22,000 సెగ్మెంట్‌లో ఈ డివైజ్ అత్యంత వేగవంతమైన స్మార్ట్‌ఫోన్ అని వివో పేర్కొంది. దేశంలో 8GB+256GB వేరియంట్ ధర రూ.22,000లోపు ఉంటుందని బ్రాండ్ పరోక్షంగా సూచించింది.

వివో టీ3 అంచ‌నా స్పెసిఫికేషన్స్‌ను ప‌రిశీలిస్తే.. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇవి 1800 నీట్స్ పీక్‌ బ్రైట్‌నెస్ స్థాయిలకు మ‌ద్ద‌ద‌తు ఇవ్వొచ్చు. త‌ద్వారా ప్రకాశవంతమైన వాతావరణంలో కూడా ఈ ఫోన్ డిస్‌ప్లే స్పష్టమైన విజువల్స్‌ను అందిస్తుంది. వివో టీ3 స్మార్ట్‌ఫోన 128GB మరియు 256GB అనే రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుందని పుకార్లు సూచిస్తున్నాయి.(Vivo T3 5G)

Also Read: Lava O2: ఇండియాలో లాంచ్‌కు రెడీ అవుతున్న లావా O2.. ముందే బ‌య‌ట‌కొచ్చిన డిజైన్‌, స్పెసిఫికేష‌న్స్!

కెమెరాల విష‌యానికి వ‌స్తే.. ఈ హ్యాండ్ సెట్ లో ట్రిపుల్ కెమెరా సెట‌ప్ ఉంటుంది. అందులో OIS మద్దతుతో 50MP Sony IMX882 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా మరియు 2MP మాక్రో కెమెరా ఉండొచ్చ‌ని భావిస్తున్నారు. అలాగే 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో బలమైన 5000mAh బ్యాటరీని ఇందులో అందిస్తున్నారు. మ‌రియు వివో టీ3 మొబైల్‌ IP54 రేటింగ్‌తో వస్తుంది. ఇది దుమ్ము మరియు నీటికి నిరోధకతను కలిగిస్తుంది.

Join WhatsApp