Vivo T3 5G Launched In India

Vivo T3 5G: ప్ర‌ముఖ స్మార్ట్‌ఫోన్ల త‌యారీదారు వివో తాజాగా ఇండియాలో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే వివో టీ3 5జీ(Vivo T3 5G). ఈ ఫోన్ గత సంవత్సరం విడుద‌లైన వివో టీ2 యొక్క స‌క్సెసర్ అని కంపెనీ తెలిపింది. క్రేజీ ఫీచ‌ర్ల‌తో ఈ స్మార్ట్‌ఫోన్ ఆవిష్క‌రించ‌బ‌డింది. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం వివో టీ3 5జీ స్పెసిఫికేష‌న్స్, ధ‌ర మ‌రియు సేల్ వివ‌రాల‌పై ఓ లుక్కేసేయండి.

Vivo T3 5G Launched In India

వివో టీ3 5జీ ఫోన్ 1080×2400 పిక్సెల్ రిజల్యూషన్ మ‌రియు 1800 nits పీక్ బ్రైట్‌నెస్ తో 6.67-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను క‌లిగి వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్ ను అందించారు. 8GB ర్యామ్ తో ఇది జత చేయబడింది. 128GB మరియు 256GB అనే రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో ఈ హ్యాండ్‌సెట్ వస్తుంది. వినియోగదారులు 1TB మైక్రో SD కార్డ్‌ని ఇన్‌స్టాల్ చేయడం ద్వారా స్టోరేజీని మరింత విస్తరించుకోవచ్చు.

అలాగే వివో టీ3 5జీ స్మార్ట్‌ఫోన్ f/1.79 ఎపర్చరుతో 50MP మెయిన్ సెన్సార్‌, f/2.4 ఎపర్చరుతో 2MP డెప్త్ సెన్సార్‌ డ్యూయల్ రియర్ కెమెరా సెట‌ప్‌ను కలిగి ఉంది. 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ FunTouch OS 14తో అగ్రస్థానంలో ఉన్న ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తుంది. రెండేళ్లు OS అప్‌డేట్ మరియు మూడేళ్లు నెలవారీ భద్రతా ప్యాచ్‌లు ఈ ఫోన్ కు లభిస్తాయని కంపెనీ ప్రకటించింది. IP54 రేటింగ్‌తో ఈ ప‌రిక‌రం వస్తుంది. ఇది దుమ్ము మరియు నీటికి నిరోధకతను కలిగిస్తుంది.(Vivo T3 5G)

Also Read: Noise ColorFit Icon 3 Plus: అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో అతి త‌క్కువ ధ‌ర‌కే నాయిస్ నుంచి కొత్త స్మార్ట్‌వాచ్ లాంచ్‌.. పూర్తి వివ‌రాలు మీకోసం!

44W ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్ తో 5000mAh బ్యాటరీని ఈ ఫోన్ లో ప్యాక్ చేశారు. ధ‌ర విష‌యానికి వ‌స్తే.. వివో టీ3 5జీ లో 8GB+128GB వేరియంట్ రూ.19,999 ట్యాగ్‌తో ప్రారంభించారు. మ‌రియు 8GB+256GB వేరియంట్ ధర రూ. 21,999 గా నిర్ణ‌యించారు. క‌స్ట‌మ‌ర్స్ కాస్మిక్ బ్లూ మరియు సిస్టల్ ఫ్లేక్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు. మార్చి 27 నుండి vivo ఇండియా ఇ-స్టోర్ మరియు Flipkart లో వివో టీ3 5జీ సేల్ స్టార్ట్ అవుతుంది. HDFC బ్యాంక్ మరియు SBI కార్డ్‌లతో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ. 2000 తక్షణ తగ్గింపు ల‌భిస్తుంది. లేదా ఎక్స్ఛేంజ్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్‌లపై రూ. 2000 తగ్గింపు పొంద‌వ‌చ్చు.

Join WhatsApp