Vivo T3x 5G launched in India as slimmest 6,000mAh battery

Vivo T3x 5G: ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి అన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది. ఎవరిని అడిగినా… ఎవరిని టచ్ చేసిన… ఇదే మాట. మాకు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయని చెబుతున్నారు. దీనికి తగ్గట్టుగానే మొబైల్ కంపెనీలు రకరకాల ఫోన్స్ రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీల ఫోన్లు మార్కెట్లో లాంచ్ అయ్యి… విక్రయాలు కూడా విపరీతంగా జరుపుకుంటున్నాయి. Vivo T3x 5G

Vivo T3x 5G launched in India as slimmest 6,000mAh battery

అయితే తాజాగా వివో నుంచి మరో కొత్త ఫోన్ వచ్చింది. వివో కంపెనీకి చెందిన టి సిరీస్ లో కొత్త మొబైల్ లాంచ్ చేశారు. వివో టి3 X పేరుతో కొత్త మొబైల్ ఫోన్ ను కంపెనీ రిలీజ్ చేసింది. వివో t2x ను అప్ గ్రేడ్ చేస్తూ ఈ కొత్త ఫోన్ తీసుకువచ్చారు. మరి కొత్త ఫోన్ ఫీచర్స్ అలాగే ధర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వివో t3x మొబైల్ ఫోన్ 6.72 అంగుళాల డిస్ప్లే ఉంటుంది. దీని రిఫ్రెష్ రేటు 120 హెచ్ జెడ్ గా కంపెనీ వెల్లడించింది. Vivo T3x 5G

Also Read: OnePlus 11 5G: వన్‌ప్లస్‌ 11పై భారీ డిస్కౌంట్‌..ఏకంగా 5 వేలు సేవ్ !

అంతేకాకుండా ఇందులో సెల్ఫీల కోసం 8 ఎంపీ మెగా పిక్సెల్ కెమెరాను అమర్చారు. అంతేకాకుండా బ్యాక్ కెమెరా 50 మెగా పిక్సెల్ సెట్ చేశారు. ఈ మొబైల్ బ్యాటరీ సైజు 6000 mah సామర్థ్యం ఉంటుంది. అలాగే ఇది ఆండ్రాయిడ్ 14 సిస్టంతో పని చేస్తుంది. కొత్తగా రిలీజ్ అయిన ఈ మొబైల్ ఫోన్లో మూడు మోడల్స్ ఉన్నాయి. Vivo T3x 5G

నాలుగు జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ ఉన్న మొబైల్ రేటు 14 వేల రూపాయలుగా ఫిక్స్ చేశారు. అలాగే ఆరు జిబి ర్యామ్ మరియు 128 gb స్టోరేజ్ ఉన్న ఫోన్స్ 15వేల రూపాయలుగా ఫిక్స్ చేశారు. అటు 8 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ ఉన్న ఫోన్లను 17వేల రూపాయలుగా ఫైనల్ చేశారు. ఎస్బిఐ మరియు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డుల ద్వారా ఈ మొబైల్ ఫోన్ కొనుగోలు చేస్తే 1500 రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఏప్రిల్ 24వ తేదీ నుంచి ఈ ఫోన్లు ఆన్లైన్లో అలాగే స్టోర్ లలో మనకు లభిస్తాయి.Vivo T3x 5G

Join WhatsApp