Vivo V30e launching on May 2

Vivo V30e Mobile: ఇండియన్ మార్కెట్లో అనేక రకాల మొబైల్ ఫోన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ కూడా మార్కెట్లోకి చాలా రకాల మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి. ఎవరి చేతిలో చూసిన కచ్చితంగా మొబైల్ ఫోన్స్ కనిపిస్తున్నాయి. ఒకరి చేతిలో రెండు కూడా ఉంటున్నాయి. దీనంతటికీ కారణం తక్కువ ధరలో మొబైల్ ఫోన్స్ మార్కెట్లోకి రావడం. దీంతో చాలామంది రెండు రెండు ఫోన్లు కూడా కొంటున్నారు. Vivo V30e Mobile

Vivo V30e launching on May 2

అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఇండియా మార్కెట్లోకి మరో సరికొత్త ఫోన్ రానుంది. కొత్త 5జి మొబైల్ ను ఇండియాలోకి తీసుకురానుంది వివో కంపెనీ. వివో వి30ఈ పేరుతో ఈ కొత్త ఫోన్ తీసుకురానుంది కంపెనీ. వివో వి 30, వివో వి 30 ప్రో స్మార్ట్ ఫోన్లు ఉన్న సంగతి తెలిసిందే. అలాగే గత సంవత్సరంలో వివో వి 29e మొబైల్ ఫోన్ కూడా రిలీజ్ అయింది. అయితే ఆ మొబైల్ ఫోన్లకు దీటుగా… వాటికి కాస్త అప్డేట్ వర్షన్ లో వివో వి 30 ఈ మొబైల్ ఫోన్ తీసుకురానుంది వివో కంపెనీ. Vivo V30e Mobile

Also Read: Xiaomi 14 Smart phone: షావోమీ 14 స్మార్ట్‌ఫోన్ పై బంపర్‌ ఆఫర్‌…ఏకంగా రూ. 30 వేలు..!

ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. మే రెండవ తేదీన మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ వివో స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతుంది. ఈతరణంలోనే ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన ఫీచర్స్ అలాగే రేటు వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి వివో v29e మొబైల్ ధర 27,000 నుంచి 29 వేల రూపాయల మధ్య ఉంది. Vivo V30e Mobile

అయితే కొత్తగా లంచ్ కాబోతున్న వివో v30e మొబైల్ ధర కూడా ఆ రేంజ్ లోనే ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మొబైల్ ఫోన్లో 5500 సామర్ధ్యమున్న బ్యాటరీ ఉండనుంది. కెమెరా విషయానికి వస్తే… సెల్ఫీల కోసం అలాగే బ్యాక్ కెమెరాలు కూడా మంచి పిక్సెల్ ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ ఫోన్ లాంచ్ చేసేటప్పుడు ఆఫర్ కూడా పెట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. Vivo V30e Mobile

Join WhatsApp