Vivo X Fold 3 To Launch In China On March 26th

Vivo X Fold 3: ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జం వివో నుంచి త్వ‌ర‌లోనే ఓ కొత్త ఫోల్డ‌బుల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. అదే వివో ఎక్స్ ఫోల్డ్ 3(Vivo X Fold 3). అయితే వివో మొద‌ట ఈ హ్యాండ్‌సెట్ ను చైనాలో ఆవిష్క‌రించ‌బోతోంది. ఇందులో భాగంగానే లాంచింగ్ తేదీని లాక్ చేసింది. మార్చి 26న చైనాలో వివో ఎక్స్ ఫోల్డ్ 3 స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేయ‌బోతున్నారు. లాంచ్ ఈవెంట్ చైనాలో సాయంత్రం 7:00 గంటలకు జరగనుంది. లాంచ్ ప్రకటనలో ఎక్స్‌ ఫోల్డ్ 3 డిజైన్‌ను కూడా వివో వెల్లడించింది.

Vivo X Fold 3 To Launch In China On March 26th

వైట్ క‌ల‌ర్ లో ఫోల్డబుల్ మరియు సన్నని బాడీని మ‌నం కంపెనీ విడుద‌ల చేసిన ఫోటోల్లో చూడవచ్చు. వివో ఎక్స్‌ ఫోల్డ్ 3 వెనుక భాగంలో వృత్తాకార కెమెరా మాడ్యూల్ మరియు బయట పెద్ద కవర్ డిస్‌ప్లే ఉంది. ఇక‌పోతే లాంచ్ కు ముందే వివో ఎక్స్ ఫోల్డ్ 3 యొక్క స్పెసిఫికేష‌న్స్‌ మరియు ఫీచర్లను టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ఆన్‌లైన్‌లో లీక్ చేశారు. వాటిని ఒక‌సారి ప‌రిశీలిస్తే..

వివో ఎక్స్‌ ఫోల్డ్ 3 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 3000 nits బ్రైట్ నెస్‌తో 8.03-అంగుళాల 2K శాంసంగ్ ఈ7 AMOLED ఎల్‌టీపీఓ 8టీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. వెలుపల వైపు ఇది 6.53-అంగుళాల కవర్ డిస్ప్లే ను క‌లిగి ఉండొచ్చు. ఫోల్డబుల్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ ద్వారా ప్యాక్ చేయ‌బ‌డుతుంద‌ని లీకులు సూచిస్తున్నాయి. అలాగే ఈ హ్యాండ్‌సెట్ ట్రిపుల్ కెమెరాతో రానుంద‌ని కంపెనీ ధృవీక‌రించింది.(Vivo X Fold 3)

Also Read: OnePlus Nord CE 4: వ‌న్‌ప్ల‌స్ నుంచి మ‌రో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. ఫీచ‌ర్లు అదుర్స్‌, ధ‌ర ఎంతంటే?

అయితే కెమెరా సెట‌ప్ లో 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 64MP టెలిఫోటో పెరిస్కోప్ జూమ్ లెన్స్‌ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు వాటర్ రెసిస్టెన్స్ కోసం IPX8 రేటింగ్‌తో ఈ ఫోల్డ‌బుల్ ఫోన్ వ‌స్తుంద‌ని అంటున్నారు. 120W వైర్డ్ ఛార్జింగ్ మరియు 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5500mAh బ్యాటరీని ఈ ఫోన్‌లో అందించ‌వ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ ఫోల్డ‌బుల్ ఫోన్‌ ధ‌ర మ‌రియు ఇత‌ర వివ‌రాలు త్వ‌ర‌లోనే బ‌ట‌య‌కు రానున్నాయి.

Join WhatsApp