VIVO Y100 5G New Mobile from Vivo

VIVO Y100 5G: వివో ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో మొబైల్ ఫోన్స్ రంగంలో దూసుకుపోతోంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన అనేక మొబైల్స్ ప్రజలకు అందుబాటు ధరలో లభిస్తూ, మంచి ఆదరణ పొందుతున్నాయి. అలాంటి వివో నుంచి VIVO Y1005G మొబైల్ వచ్చింది. మరి ఈ మొబైల్ యొక్క ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, ధర వివరాలు చూసేద్దామా..వివో వై100 5జి ఇండోనేషియాలో లాంచ్ అయింది.

VIVO Y100 5G New Mobile from Vivo

అలాంటి ఈ మొబైల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెట్ అప్, 50 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఇండోనేషియాలో లాంచ్ అయిన ఈ వేరియంట్ చైనా వేరియంట్ కంటే ఎక్కువ స్పెసిఫికేషన్స్ కలిగి ఉందట. స్నాప్ డ్రాగన్ 4 జనరేషన్, 2 చిప్ సెట్ అమర్చబడి 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్ కలిగి ఉంది. అంతేకాకుండా వివో వై100, 5జి బ్లాక్, ఓనీక్స్ మరియు పర్పుల్ ఆర్చిడ్ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది.

Also Read: iPhone 15 Series: కొత్త ఐఫోన్-15పై… 13 వేల రూపాయల డిస్కౌంట్..వివరాలు ఇవే

ఈ మొబైల్ ధర విషయానికి వస్తే.. వివో వై 100 5జి, 8gb ram , 128gb ఇన్బిల్ట్ స్టోరేజ్ వెరియంట్ కోసం దాదాపుగా రూ:20,500 ధర ఉండవచ్చని తెలుస్తోంది. అలాగే 8gb ర్యామ్, 256 జిబి ఇన్బిల్ట్ స్టోరేజ్ మోడల్ ధర రూ:20000 ఉండవచ్చని అంచనా. ప్రస్తుతం ఈ మొబైల్ ఇండోనేషియాలో ఆన్ లైన్ రిటైల్ స్టోర్ లలో అందుబాటులోకి వచ్చింది. (VIVO Y100 5G)

VIVO Y100 5G: New Mobile from Vivo

వివో వై1005జి ఇండియన్ లాంచ్ వివరాలు తెలియవు కానీ, Y100I పవర్ 12 జిబి ర్యామ్, 512 జిబి అంతర్గత నిల్వ యొక్క వేరియంట్ ధర దాదాపు రూ :24వేలు. అయితే వివో వై100 పాత వేరియంట్ ఫిబ్రవరి 2023లో లాంచ్ అయింది. ఇందులో 8 జిబి ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వెరియంటు అంటే దాదాపు రూ: 24,999 కలిగి ఉంది. ఈ మొబైల్ మీడియ టెక్ డైమన్ సిటీ 900Soc 44 డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ,4,500mah బ్యాటరీ కలిగి ఉంది.

Join WhatsApp