Vivo Y200i : చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం వివో ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్స్ ని తీసుకు వస్తూనే ఉంటుంది. చైనా మార్కెట్లోకి మరి కొన్ని కొత్త ఫోన్స్ ని లాంచ్‌ చేసింది. వివో వై200ఐ పేరుతో కొత్త ఫోన్‌ను ఇప్పుడు కంపెనీ తీసుకు వచ్చింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ ఫోన్‌ ను బడ్జెట్‌ మార్కెట్‌ ను టార్గెట్‌ చేసుకొని తీసుకొచ్చింది. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ లో ఎలాంటి ఫీచర్లు ఉంటాయి, దీని ధర ఎంత వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వివో వై200ఐ స్మార్ట్ ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆరిజిన్ఓఎస్ 4 ఆపరేటింగ్ సిస్టం మీద పనిచేస్తుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌ను ఇచ్చారు.

Vivo Y200i super features smartphone

అలానే, ఇక ఈ ఫోన్‌ లో 6.72 ఇంచెస్‌ తో కూడిన ఎల్సీడీ డిస్‌ప్లే ను అందించారు. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌ గా వుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ సైడ్‌కి ఇచ్చారు. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,800, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,200గా వున్నది. 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,500గా వుంది.

Also read: Chiranjeevi: చిరంజీవిని అవమానించి పుట్టింటికి వెళ్ళిపోతానని బెదిరించిన సురేఖ.. కారణం..?

గ్లేసియర్ వైట్, స్టారీ నైట్, వాస్ట్ సీ బ్లూ కలర్ ఆప్షన్స్‌లో దీన్ని తీసుకు వచ్చారు. 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి ఫీచర్స్ ఇచ్చారు. 44 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని కూడా ఇచ్చారు (Vivo Y200i).

Join WhatsApp