Vivo Y27 And Vivo T2 Prices Reduced In India

Vivo Y27- Vivo T2: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాల‌ని భావిస్తున్నారా..? అయితే మీకు చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో గుడ్‌న్యూస్ చెప్పింది. వివో వై200 5జీ స్మార్ట్‌ఫోన్ ను తాజాగా ఇండియాలోకి న్యూ వేరియంట్ తో ప‌రిచ‌యం చేసింది. ఆ సంద‌ర్భంగా త‌న సరసమైన వివో వై27(Vivo Y27) మ‌రియు మిడ్ రేంజ్‌ వివో టి2(Vivo T2) స్మార్ట్‌ఫోన్ల ధ‌ర‌ను భారీగా త‌గ్గించింది. వివో వై27 ధర రూ. 3,000 తగ్గింది. అలాగే వివో టి2 ధర కూడా రూ. 3,000 దిగొచ్చింది. మ‌రిన్ని వివారాల‌ను ప‌రిశీలిస్తే..

Vivo Y27 And Vivo T2 Prices Reduced In India

గతేడాది జులైలో వివో వై27 స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ +128జీబీ స్టోరేజ్‌ మోడల్ రూ.14,999 వ‌ద్ద ప్రారంభించ‌బ‌డింది. అయితే తాజాగా కంపెనీ రూ. 3,000 డిస్కౌంట్ ను ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం ఈ ఫోన్ ధ‌ర రూ. 11,999 వ‌ద్ద ఉంది. అన‌దంగా కస్టమర్‌లు SBI, యెస్ బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, DBS బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ మరియు ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లతో పాటు V-షీల్డ్ వంటి ప్రయోజనాలను ఉపయోగించి రూ. 1,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు.

Vivo Y27 And Vivo T2 Prices Reduced In India

స్పెసిఫికేష‌న్స్ విష‌యానికి వ‌స్తే.. వివో వై27 వాటర్‌డ్రాప్ నాచ్‌తో 6.64-అంగుళాల IPS LCD ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను క‌లిగి ఉంటుంది. మీడియాటెక్ హీలియో G85 ప్రాసెస‌ర్ ను అమ‌ర్చారు. ఆండ్రాయిడ్‌ 13-ఆధారిత FunTouch OS 13పై ర‌న్ అవుతుంది. 50MP ప్రధాన కెమెరా, 2MP బోకె కెమెరాతో డ్యూయ‌ర్ కెమెరా సెట‌ప్‌, 8MP ఫ్రెంట్ ఫేసింగ్ కెమెరా ఉంటాయి. 44W ఫ్లాష్‌ఛార్జ్ టెక్నాలజీతో 5,000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందించారు.(Vivo Y27- Vivo T2)

Also Read: Acer Swift Go 14: ఇంటెల్ కోర్ అల్ట్రా లాప్ ప్టాప్..7 ప్రొసెసర్.. అద్భుత ఫీచర్స్..!

వివో టి2లో రెండు వేరియంట్స్ ఉన్నాయి. 6జీబీ ర్యామ్ +128జీబీ స్టోరేజ్‌ మోడల్ ధ‌ర రూ. 18,999 నుంచి రూ. 15,999కి దిగొచ్చింది. అలాగే 8జీబీ ర్యామ్ +128జీబీ స్టోరేజ్ ధ‌ర రూ. 20,999 నుంచి రూ. 17,999కి త‌గ్గింది. కొత్త ధర ఫిబ్రవరి 1 నుండి ఫ్లిప్‌కార్ట్ మరియు వివో ఇండియా ఇ-స్టోర్‌లో అమలులోకి వస్తుంది. వివో టి2 స్పెసిఫికేష‌న్స్ ను ప‌రిశీలిస్తే.. 6.38-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ AMOLED డిస్‌ప్లేను క‌లిగి ఉంది. క్వాల్క‌మ్ స్నాప్‌డ్రాగన్ 695 SoC ప్రాసెస‌ర్‌ను ఈ హ్యాండ్‌సెట్ లో ఇన్‌స్టాల్ చేశారు. OIS మరియు EISతో 64MP ప్రైమరీ సెన్సార్ మరియు 2MP బోకె సెకండరీ కెమెరా సెన్సార్ ఉంటాయి. 16MP ఫ్రెంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. మ‌రియు 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

Join WhatsApp