Whatsapp: ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ని వాడుతున్నారు వాట్స్అప్ ద్వారా ఎన్నో ఉపయోగాలుని మనం పొందవచ్చు. ఈజీగా మనం వాట్సాప్ ద్వారా ఫొటోస్ వీడియోస్ వంటివి షేర్ చేసుకోవచ్చు వాట్సాప్ ఉండడం వలన ఈజీగా షేర్ చేసుకోవడంతో పాటుగా చాట్ వీడియో కాల్స్ ఇటువంటివి కూడా చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ని వినియోగిస్తూ ఉంటారు అయితే బ్రేకప్ లేకుండా డేటా ట్రాన్స్ఫర్ ఎలా చూసుకోవాలి అనే విషయాన్ని రోజు చూద్దాం. వాట్సాప్ లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఇది మరి ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలని చూసేద్దాం.

Whatsapp Data Transfer without Backup

సాధారణంగా వాట్సాప్ ఉపయోగిస్తున్న తరుణంలో డేటా పెద్ద ఎత్తున స్టోర్ అవుతూ ఉంటుంది ఒకవేళ కొత్త ఫోన్ ని కొనుగోలు చేసిన టైంలో పాత ఫోన్ లో ఉన్న వాట్స్అప్ డేటా ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలని అందరూ అనుకుంటారు ఇందుకోసం బ్యాకప్ ఆప్షన్ ఎంచుకోవాలి పాత ఫోన్లో డేటా ని బ్యాకప్ చేసుకున్నాక కొత్త ఫోన్లో రిజిస్టర్ చేసుకోవాలి తాజాగా వాట్సాప్ తీసుకొచ్చిన ఈ ఫీచర్ ద్వారా బ్యాకప్ అవసరం లేకుండా డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.

Also read: Green tea: గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలో తెలుసా?.. తరహా కలిగే ఉపయోగాలు ఇవే..!

దీని కోసం మీ దగ్గర పాత ఫోన్ తో పాటుగా కొత్త ఫోన్ కూడా ఉండాలి రెండు స్మార్ట్ ఫోన్లు ఒకే వైఫై నెట్వర్క్ కనెక్ట్ అవ్వాలి. ముందుగా మీ స్మార్ట్‌ ఫోన్‌లో వాట్సప్‌ ఓపెన్‌ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. చాట్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి చాట్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. పాత ఫోన్‌లో చాట్‌ ట్రాన్స్‌ఫర్‌ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌ ఓపెన్‌ అవుతుంది. కొత్త ఫోన్‌లో వాట్సప్‌ ఇన్‌స్టాల్‌ చేసి, అదే ఫోన్‌ నెంబర్‌తో లాగిన్‌ అవ్వాలి. పాత ఫోన్‌కు వచ్చే వెరిఫికేషన్‌ కోడ్‌ను కొత్త దాంట్లో ఇవ్వాలి. పాత ఫోన్‌లో చూపించే స్కానర్‌తో స్కాన్‌ చేయాలి. వెంటనే పాత ఫోన్‌లో ఉన్న డేటా కొత్త ఫోన్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది (Whatsapp).

WhatsApp Plans to Launch Nearby Share Feature for Android Users
Join WhatsApp