WhatsApp Introduces Feature To Pin Up To 3 Messages In Chat

Whatsapp: స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ని వాడుతున్నారు. వాట్సాప్ ద్వారా అనేక ఉపయోగాలు ఉన్నాయి. వాట్సాప్ లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు కూడా వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లను తీసుకువస్తూ ఉంటుంది. వాట్సాప్ లో టైపింగ్ కి ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో వాయిస్ మెసేజ్ ను తీసుకొచ్చింది వాట్సాప్. ఈ ఫీచర్ సహాయంతో క్షణాల్లో వాయిస్ మెసేజ్ ని మనం పంపించుకోవచ్చు. ఇది ఇలా ఉండగా వాయిస్ మెసేజ్ ని కొన్ని సందర్భాల్లో అందరి ముందు వినే అవకాశం ఉండదు ఈ సమస్యకి చెక్ పెట్టడానికి కొత్త ఫీచర్ ని వాట్సాప్ తీసుకొచ్చింది ఫీచర్ కి సంబంధించి పూర్తి వివరాలను చూద్దాం.

Whatsapp new feature

వాట్సాప్ టైపింగ్ కి ఇబ్బంది కాకూడదని ఉద్దేశంతో వాయిస్ మెసేజ్ ని తీసుకొచ్చింది అయితే ఇప్పుడు ఇలా కూడా కాకుండా వాయిస్ ద్వారా టైపింగ్ చేయగలిగే ఫీచర్ ని తీసుకువచ్చింది. వాయిస్ నోట్ ట్రాన్స్క్రిప్షన్ పేరుతో ఈ కొత్త ఫీచర్ ని తీసుకొచ్చారు ఈ ఫీచర్ సహాయంతో వాయిస్ మెసేజ్ లను టెక్స్ట్ రూపంలోకి మార్చుకోవచ్చు దీంతో ఆడియో మెసేజ్ ని వినకుండా మెసేజ్ ని చదివి తిరిగి రిప్లై ఇవ్వచ్చు ఇది ఇలా ఉంటే వాట్సాప్ ఇప్పటికే కొత్త ఫీచర్ ని కొందరు ఐఓఎస్ యూసర్లకే అందుబాటులోకి తీసుకొచ్చింది.

Also read: Samantha: ఆ వ్యక్తితో సమంత సీక్రెట్ ప్రేమాయణం.. ఫైనల్ గా బయటపడిందిగా..!!

ప్రస్తుతం ఇది టెస్టింగ్ స్టేజ్లో ఉంది ఈ ఫీచర్ ని త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్లకి అందుబాటులో ఉండే విధంగా తీసుకురాబోతున్నారు. ఈ కొత్త ఫీచర్ కోసం యూజర్లు అదనంగా 150 ఎంబి యాప్ డేటా డౌన్లోడ్ చేయాలి వాయిస్ నోట్స్ ని టెక్స్ లోకి మార్చడానికి డివైస్ స్పీచ్ రికగ్నైజేషన్ ఫీచర్ ని వాట్సాప్ లో వాడుకుంటుంది. ప్రయివసీ విషయంలో కూడా ఏ ఇబ్బందులు ఉండవని వాట్సాప్ చెప్తోంది. ఈ ఫీచర్ ని ఉపయోగించే వాళ్ళకి మెసేజ్ బబుల్స్ లో వాయిస్ నోట్స్ రూపంలో కనబడతాయి. త్వరలోనే ఫీచర్ అందరికీ అందుబాటులోకి వస్తుంది దీని అధికారిక ప్రకటన రావాల్సి ఉంది (Whatsapp).

WhatsApp Introduces Feature To Pin Up To 3 Messages In Chat
Join WhatsApp