WhatsApp Plans to Launch Nearby Share Feature for Android Users

WhatsApp: ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ని వాడుతున్నారు. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేకపోతే ఏదీ లేదు అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. ప్రతి ఒక్క దానికి కూడా స్మార్ట్ ఫోన్ మీద ఆధార పడిపోయాము ఇది ఇలా ఉంటే స్మార్ట్ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి ఫోన్లో కూడా వాట్సాప్ ఉంటోంది. వాట్సాప్ తో అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఈజీగా మనం మీడియా షేర్ చేసుకోవచ్చు దానితో పాటుగా వాయిస్ కాల్స్ వీడియో కాల్స్ ఇలా వాట్సాప్ తో అనేక లాభాలు ఉంటాయి. అయితే వాట్సాప్ ఫీచర్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎప్పటికప్పుడు వాట్సాప్ కొత్త కొత్త ఫ్యూచర్ లని తీసుకువస్తూ ఉంటుంది. వాట్సాప్ ఫీచర్స్ తో హ్యాపీగా యూజర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఇక ఇది ఇలా ఉంటే ఈ రోజుల్లో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

WhatsApp new feature coming soon

మన ఫోటోలకి కూడా రిస్క్ ఎక్కువగా ఉంటుంది అయితే వాటి కోసం వాట్సాప్ కొత్త ఫీచర్ ని తీసుకువచ్చింది. వాట్సాప్ తీసుకొచ్చిన ఈ తాజా ఫీచర్ వలన ఇక మీదట ప్రొఫైల్ ఫోటోలని స్క్రీన్ షాట్ తీయడానికి కుదరదు. ఎవరైనా మీ ప్రొఫైల్ ఫొటో ని స్క్రీన్ షాట్ తీయడానికి ట్రై చేస్తే వాట్సాప్ డీపీ బ్లాక్ చేసినట్లుగా కనబడుతుంది. ఈమధ్య కాలంలో వాట్సాప్ డీపీ లను ఎడిట్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు.

Also read: Modi Government: ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మోడీ వైపు చూస్తున్నారు…!

ఇటువంటివి ఎక్కువగా కనబడుతున్నాయి ఫేక్ ఫోటోలతో బెదిరింపులకి పాల్పడుతున్నారు ఇలాంటి బెదిరింపుల్ని అరికట్టడానికి ఈ కొత్త ఫీచర్ ని తీసుకువచ్చింది. వాట్సాప్ యూజర్ల అనుమతి లేకుండా ప్రొఫైల్ ఫోటో ని క్యాప్చర్ చేయకుండా షేర్ చేయకుండా కట్టడి చేయడం ద్వారా వాట్సాప్ లో యూజర్ ల డేటా కి రక్షణ ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతము ఈ ఫీచర్ టెస్టింగ్ స్టేజ్ లో ఉంది ఈ ఫీచర్ ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఈ ఫీచర్ కనుక వచ్చిందంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. హ్యాపీగా డీపీ ని పెట్టుకోవచ్చు (WhatsApp).

WhatsApp Plans to Launch Nearby Share Feature for Android Users
Join WhatsApp