WhatsApp Plans to Launch Nearby Share Feature for Android Users

WhatsApp: వాట్సప్… ప్రస్తుతం ప్రతి ఒక్కరూ దీన్ని వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్ లో…. ఖచ్చితంగా వాట్స్అప్ ఉంటుంది. వాట్సాప్ ద్వారా మనం అనేక సదుపాయాలను పొందవచ్చు. ముఖ్యంగా ఒక సమాచారాన్ని ప్రపంచంలోని ఏ ఎక్కడికైనా మనం పంపించగలుగుతున్నాం. సమాచారమే కాకుండా ఫోటోలు మరియు వీడియోలు కూడా ఇతరులకు షేర్ చేసుకోగలుగుతున్నాం.

WhatsApp Plans to Launch Nearby Share Feature for Android Users

గతంలో కేవలం మెయిల్ ద్వారా మన సమాచారాన్ని ఇతరులకు పంపించేవాళ్లం. కానీ వాట్సప్ వచ్చిన తర్వాత… పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అయితే వాట్సప్ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంది. ఏదో ఒక ఫీచర్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే అనేక రకాల ఫీచర్స్ మార్కెట్లోకి రిలీజ్ చేసింది వాట్సాప్.

Also read: Vivo : బడ్జెట్ ధరలో Vivo G2 స్మార్ట్‌ఫోన్..ధర, ఫీచర్స్ ఇవే

అయితే తాజాగా మరో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది వాట్స్అప్. ఆండ్రాయిడ్ షేర్ నియర్ బై, యాపిల్ హెయిర్ డ్రాప్ లాగానే… షేరింగ్ సిస్టం పరిచయం చేసేందుకు వాట్సప్ ప్రయత్నం చేస్తుంది. ఈ ఫీచర్ వాడి మనం ఫైల్స్ చాలా సులభంగా ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు వీలు ఉంటుంది.

వాట్సాప్ నియర్ బై షేర్ వర్షన్ తో ఎండ్ టు ఎండ్ ఇన్క్రెప్టెడ్ ఫైళ్లను పంపడానికి అలాగే మనం స్వీకరించడానికి… ఈ కొత్త ఫీచర్ ఉపయోగపడుతుంది. మనం ఫైల్స్ బదిలీ చేయడానికి రెండు డివైస్ల మధ్య బ్లూటూత్ కనెక్టివిటీ సహాయంతో చేసుకుంటాం. ఇప్పుడు త్వరలో వాట్సాప్ లోను ఇదే రాబోతుంది. దీనిపై పరిశోధనలు చేస్తున్నట్లు కంపని తెలిపింది. (WhatsApp)

Join WhatsApp