Why Do Cockpit Doors Open During Boarding?

Cockpit Doors: ప్రయాణికులు ఫ్లైట్ ఎక్కేటప్పుడు అలానే దిగేటప్పుడు పైలెట్ కూర్చున్న కాక్ పిట్ తలుపు తెరిచి ఉండడాన్ని మీరు గమనించారా… విమాన ప్రయాణ సమయంలో కాక్ పీస్ డోర్ మూసి ఉంటుంది కానీ మిగిలిన సమయంలో తెరిచి ఉంటుంది విమానం ల్యాండింగ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఈ డోర్ ని ఎందుకు తెరిచి ఉంచుతారు..? అయితే మనం ఫ్లైట్ ఎక్కేటప్పుడు సెక్యూరిటీ చెకింగ్ ఇవన్నీ పూర్తయిన తర్వాత విమానం ఎక్కేటప్పుడు ప్రయాణికుడు ఉన్న ప్రాంతం ద్వారా డోర్ నుండి ఎక్కాల్సి ఉంటుంది దీని ద్వారా కాక్ పిట్ లోపల ప్రయాణికులు సులభంగా చూడొచ్చు.

Why Do Cockpit Doors Open During Boarding?

దిగేటప్పుడు కూడా ఇలానే కనబడుతుంది విమానం ప్రయాణిస్తున్న టైం లో ప్రయాణికులు కాక్ పిట్ ఏరియా దగ్గరికి వెళ్తే డెక్ ఏరియా తలుపులు క్లోజ్ చేసి ఉంటాయి. విమానం నేలపై ఉన్నప్పుడు మాత్రమే ఇది తెరిచి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని విమానయాన సంస్థలు విమానం నేలపై ఉన్నప్పుడు ఈ తలుపులు తెరిచి ఉంచాలనే నియమని పాటిస్తాయి.

Also Read: Netflix: నెట్‌ఫ్లిక్స్ కీలక నిర్ణయం.. యూజర్లకి షాక్… !

విమానం టేక్ ఆఫ్ అయ్యే ముందు చాలా చెకింగ్ ఉంటుంది ఇంధనం నింపుకోవడం విమానం టాక్సీ లైన్స్ స్పష్టంగా ఉందా లేదా అనేది చూసుకోవడం ఇటువంటివి చూస్తూ ఉంటారు. వీళ్ళందరూ నేరుగా ఎయిర్లైన్ డెక్ పరిధిలోకి వస్తారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడానికి ముందు పైలెట్ కి సమాచారం ఇవ్వాలి చివరగా పైలెట్ కాక్ పిట్ లోపల తన పనిలో నిమగ్నమై ఉంటారు. చూసుకోవాల్సి ఉంటుంది ఆ టైంలో ఇతర సిబ్బందితో మాట్లాడుతారు అదే టైంలో అతను విమానం బోర్డింగ్ ని పర్యవేక్షించవలసి వస్తే మాత్రం తలుపులు తెరిచి ఉంచాలి.

Why Do Cockpit Doors Open During Boarding?

ఫ్లైట్ సిబ్బందితో కమ్యూనికేట్ అవ్వడం కోసం తలుపు తెరిచి ఉంచుతారు అందుకే ప్రయాణికులు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు లోపల ఏముందో చూసే అవకాశం ఉంటుంది కొన్నేళ్ల క్రితం అయితే ప్రయాణికులు కావాలని అనుకుంటే విమానం యొక్క డెక్ లోపల చూడడానికి పర్మిషన్ ఇచ్చేవారు కానీ ఇప్పుడు అనుమతి ఇవ్వట్లేదు. (Cockpit Doors)

Join WhatsApp