MS Dhoni steps down as captain of CSK in IPL 2024. Ruturaj Gaikwad to lead the team

MS Dhoni: ఐపీఎల్ 2024 టోర్నమెంటు రేపటి నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. రేపటి నుంచి ఐపిఎల్ టోర్నమెంట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో… చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కెప్టెన్సీని వదులుకుంటూ కీలక నిర్ణయం తీసుకున్నారు మహేంద్ర సింగ్ ధోని. MS Dhoni

IPL 2024 MS Dhoni steps down, Ruturaj Gaikwad replaces him as CSK captain

దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొత్త కెప్టెన్ గా ఓపెనర్ రుతురాజు గైక్వాడ్ ను నియామకం చేసింది ఆ జట్టు యాజమాన్యం. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ఇవాళ ఐపీఎల్ ట్రోఫీతో పది చెట్ల కెప్టెన్లు ఫోటోషూట్లకు ఫోజులు ఇచ్చారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున మహేంద్ర సింగ్ ధోని స్థానంలో రుతురాజు గైక్వాడ్ వచ్చాడు. దీంతో ఈ విషయం ఫైనల్ అయిపోయింది. MS Dhoni

Also Read: IPL 2024: CSK కు గుడ్‌ న్యూస్‌.. స్టార్‌ ఆటగాడు వచ్చేస్తున్నాడు?

అటు ఐపీఎల్ యాజమాన్యం కూడా ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించింది. అంతేకాకుండా పంజాబ్ జట్టుకు జితేష్ శర్మ వైస్ కెప్టెన్ అయినట్టు తెలిపింది. మహేంద్రసింగ్ తాజా నిర్ణయంతో రుతురాజ్ గైక్వాడ్ కు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును నడిపించే అవకాశం కలిగింది. అంటే ఈ లెక్కన ఈ టోర్నమెంట్ మొత్తం మహేంద్రసింగ్ ధోని నార్మల్ ప్లేయర్ గానే జట్టులో ఆడనున్నాడు. MS Dhoni

కాగా మహేంద్ర సింగ్ ధోని సారధ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఏకంగా ఐదు టోర్నమెంటు లను గెలిచిన సంగతి తెలిసిందే. తన కెప్టెన్సీ లో ఏకంగా 128 మ్యాచ్లను గెలిపించాడు ధోని. ఇది ఇలా ఉండగా ఐపిఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా శుక్రవారం రోజున చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చెన్నై లోని చపాక్ స్టేడియంలో జరుగుతుంది. MS Dhoni

Join WhatsApp