Jagan: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (Jagan) సోమవారం అనగా నేడు వైయస్సార్ కడప జిల్లాలో పర్యటించబోతున్నారు. పులివెందులలో ముఖ్యమంత్రి వివిధ అభివృద్ధి పనులకి ప్రారంభోత్సవం చేస్తారు ఆ తర్వాత పలు వాటికి శ్రీకారం చుట్టబోతున్నారు అధికారికంగా ఖరారైన పర్యటన కి సంబంధించి వివరాలు చూసేద్దాం మరి ఎటువంటి ఆలస్యం లేకుండా దీనిపై ఒక లుక్ వేసేయండి. ఈరోజు ఉదయం 10:20కి కడప ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు జగన్మోహన్ రెడ్డి అక్కడి నుండి 10:25కి హెలికాఫ్టర్ లో బయలుదేరి 10:40కి పులివెందులలోని బకరాపురం హెలీపాడ్ కి చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన బయలుదేరుతారు 10:50 కి డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ వద్దకు చేరుకుంటారు 11:35 వరకు హాస్పిటల్లో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొబోతున్నారు జగన్ 11:35కి రోడ్డు మార్గాన్ని బయలుదేరి 11:45 కి బనానా ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ బ్యాక్ హౌస్ దగ్గరికి చేరుకుంటారు.

Jagan kadapa tour

మధ్యాహ్నం 12 గంటలకు బ్యాక్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గడుపుతారు. ఆ తర్వాత అక్కడి నుండి బయలుదేరి 12:10 గంటలకి వైయస్సార్ మినిస్ట్రీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ వద్దకు చేరుకుంటారు 12:25 వరకు కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉండి 12:30 వరకు డాక్టర్ వైయస్సార్ జంక్షన్ వద్దకి చేరుకుని 12:35 వరకు ఆ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు 12:35 నుండి 12:40 వరకు సెంట్రల్ బోలే వార్డు ప్రారంభిస్తారు తర్వాత అక్కడ బయలుదేరుతారు 12:50 కి వైయస్ జగన్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్ వద్దకు చేరుకుని ఒంటిగంట వరకు కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.

Also read: Oppo Pad Air: రూ:4వేల తగ్గింపుతో ఒప్పో ఆండ్రాయిడ్ టాబ్లెట్..!

తర్వాత మధ్యాహ్నం ఉలిమెల్ల లేక్ ఫ్రంట్ వద్దకే చేరుకుంటారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో గడుపుతారు. ఆదిత్య బిర్లా యూనిట్ వద్దకు చేరుకుని రెండు ఐదుకి ఆదిత్య బిర్లా యూనిట్ ఫేస్ వన్ ప్రారంభోత్సవంలో గడపబోతున్నారు. 2:25కి ఇడుపులపాయ హెలిపాడ్ కి చేరుకుంటారు. వైయస్సార్ మెమోరియల్ పార్కు వద్దకి చేరుకుని ప్రారంభోత్సవంలో గడపబోతున్నారు. అక్కడ నుండి బయలుదేరి మూడు గంటలకి గెస్ట్ హౌస్ చేరుకుంటారు సాయంత్రం నాలుగు గంటల వరకు నాలుగు గంటలకే గెస్ట్ హౌస్ నుండి బయలుదేరి 04:05 కి ఇడుపులపాయ హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ నుండి హెలికాప్టర్లో బయలుదేరి 04 :25 కి కడప హెలికాప్టర్ ఎయిర్ పోర్ట్ కి చేరుకుంటారు 4:35కి కడప ఎయిర్పోర్ట్ నుండి విమానంలో బయలుదేరి గన్నవరం చేరుకుంటారు ఐదున్నర నుండి 5:50 కి అధికార నివాసానికి చేరుకుంటారు (Jagan).

AP CM Jagan's Key Initiatives Ahead of Elections
Join WhatsApp