Chandrababu Naidu asthula details

అబద్ధాల ప్రచారం… ఉత్తుత్తి గాలి కబుర్లు

పల్లెల్లో కొందరుంటారు… ఉత్త గాలి పోగేసి కబుర్లు చెప్పడం… జనాన్ని నమ్మించడం… వాళ్ళు నమ్మకపోతే వాళ్ళను గందరగోళపర్చడం.. ఇదే వారి వృత్తి… చంద్రబాబు గత ముప్పయ్యేళ్లుగా చేస్తున్నది…నమ్ముకున్నది కూడా దీన్నే…

సినిమా ఎప్పుడైతే చప్పగా ఉన్నట్లు అనిపిస్తుందో… సరిగ్గా అప్పుడే రెండు కామెడీ జోక్స్…లేదా మంచి మసాలా ఐటం సాంగ్ వేస్తారు… దీంతో మళ్ళీ థియేటర్లో ప్రేక్షకులు ఎటెన్షన్లోకి వచ్చి…సినిమాలో లీనమవుతారు… అచ్చం చంద్రబాబు కూడా ఇదే విధానము ఫాలో అవుతున్నారు. టీడీపీ గ్రాఫ్… చంద్రబాబు ప్రతిష్ట ఎప్పుడైతే డౌన్ అవుతోందని గ్రహిస్తారో…. అప్పుడు తన మీడియాను… పచ్చ జనాన్ని… అలవోకగా బొంకగలిగేవాళ్లను జనంలోకి దించుతారు… వీళ్ళే మౌత్ టాక్ మల్లిగాళ్ళు వీళ్ళు జనం ఎక్కువగా ఉండే హోటళ్లు… టీ స్టాళ్లు.. బస్సులు…రైల్వే కౌంటర్ల వద్ద అకస్మాత్తుగా ప్రత్యక్షమై ఉన్నఫళంగా ప్రభుత్వాన్ని తిడుతూ అరుస్తూ కేకలు వేస్తారు..

అక్కడ ఉన్నవాళ్ళంతా ఆటే చూసేలా చేస్తారు…. ఐదారు నిముషాలు స్క్రిప్ట్ ప్రకారం తమిళ యాక్టర్లు మనోరమ.. శివాజీ గణేష్ లను మించిపోయేలా యాక్టింగ్ చేసేసి వెళ్ళిపోతారు… చూసేవాళ్ళు మాత్రం…వామ్మో ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉందా అని జనం అనుకోవాలనేది వాళ్ళ ప్లాన్. అయితే గ్రామస్థాయిలో ప్రజల అభిప్రాయం మాత్రం వేరేలా ఉంది. ఈ ఐదేళ్ళలో సీఎం వైయస్ జగన్ తమకు ఎంత మేలు చేశారన్నది లెక్కలు వేసుకుని మరీ ప్రజలు ఓటు చేతబట్టుకుని ఎన్నికల టీడీకోసం సిద్ధంగా ఉన్నారు… మళ్ళీ తమ సోదరుడిని గెలిపించుకోవాలని వాళ్లంతా ఎదురుచూస్తున్నారు. ప్రజల్లో అలా అభిప్రాయం ఉన్నపుడు ఈ మౌత్ టాక్ మల్లిగాళ్ళు ప్రజల మనోభిప్రాయాలను మార్చలేరని అంటున్నారు. ఎన్నిసారు అరిచినా ఇత్తడిని పుత్తడి చేయలేరని.. చంద్రబాబును మళ్ళీ గెలిపించలేరని అంటున్నారు

Join WhatsApp