Ram Charan And Buchi Babu Movie Title Locked

Ram Charan: ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రాబోతోంది. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తుండ‌గా.. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, రాజోలు భామ అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Ram Charan And Buchi Babu Movie Title Locked

శ్రీకాంత్, నవీన్ చంద్ర, జయరామ్, ఎస్ జె సూర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న గేమ్ ఛేంజ‌ర్ 2024 లో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గేమ్ ఛేంజ‌ర్ అనంతరం రామ్ చరణ్ త‌న తదుపరి చిత్రాన్ని ఉప్పెన ఫేమ్‌ బుచ్చిబాబుతో చేయబోతున్నాడు. ఆర్సీ16 వర్కింగ్ టైటిల్ తో గ‌త ఏడాదే ఈ ప్రాజెక్టును ప్రకటించారు.

అలాగే ఈ చిత్రంలో శ్రీదేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపిక అయింది. విజ‌య్ సేతుప‌తి విల‌న్ గా న‌టించే అవ‌కాశాలు ఉన్నాయి. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సాగే స్పోర్ట్స్ డ్రామాగా బుచ్చిబాబు ఈ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ తెర‌పైకి వచ్చింది. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబో మూవీకి టైటిల్ లాక్ అయిందని వార్తలు వస్తున్నాయి.(Ram Charan)

Also Read: Sandeep Reddy Vanga: యానిమ‌ల్ స‌క్సెస్‌తో రెమ్యున‌రేష‌న్ భారీగా పెంచేసిన సందీప్ రెడ్డి వంగా.. ఏకంగా అన్ని కోట్లా..?

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి పెద్ది అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట. గ‌తంలో ఇదే టైటిల్ ను ఎన్టీఆర్ సినిమా కోసం బిచ్చిబాబు రిజిస్ట‌ర్ చేయించారు. ఇప్పుడు అదే టైటిల్ ను రామ్ చ‌ర‌ణ్ తో చేయ‌బోయే చిత్రానికి ఖ‌రారు చేసిన‌ట్లు జోరుగా టాక్ న‌డుస్తోంది. అంతేకాకుండా మార్చి 20న టైటిల్ ను అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇక‌పోతే పెద్ది టైటిల్ మెగా అభిమానులు మ‌రియు సినీ ప్రియుల్లో చాలా మందికి న‌చ్చ‌లేదు. దీంతో పెద్ది టైటిల్ గురించి సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌లు షురూ చేశారు. అదేం టైటిల్ అని కొంద‌రు.. టైటిల్ అలా ఉందేంట్రా బాబు అని మ‌రికొంద‌రు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

Join WhatsApp