మేకలకు ఏడాది జైలు శిక్ష! ఏం తప్పు చేశాయో వింటే నవ్వుతారు!

మనుషులకు విధించినట్లు జంతువులకు కూడా జైలు శిక్షలు విధిస్తారని విన్నారా?. ఔను! ఇది నిజం. 

బంగ్లాదేశ్‌లో ఓ వ్యక్తి కి చెందిన తొమ్మిది మేకలు స్మశాన వాటికలో చెట్ల ఆకులు, గడ్డి తిన్నాయని అరెస్టు చేశారు అధికారులు.  

దాదాపు ఏడాదికి పైగా జైలు శిక్ష అనుభవించి ఇటీవలే బంధిఖానా నుంచి విముక్తి పొందాయి ఆ తొమ్మిది మేకలు. 

రష్యాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. జైలులో ఓ పిల్లి అక్రమంగా ఫోన్‌లు, గాడ్జెట్‌లు రవాణ చేస్తుందని అరెస్టు చేసి బంధించారు.  

ఉత్తరప్రదేశ్‌ల్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ ఎనిమిది గాడిదలు లక్షలు విలువ చేసే మొక్కలు తినేశాయని అరెస్టు చేశారు.