telugu.pakkafilmy.com

Kejriwal voter list: ఢిల్లీలో ఎస్ఐఆర్ ప్రకంపనలు.. కేజ్రీవాల్ కుటుంబానికి నోటీసులు!!

ఢిల్లీలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పేరు ‘unmapped’ కేటగరీలో నమోదైనట్లు ఆయన పార్టీ ఆరోపించింది.

దీనిపై ఎన్నికల సంఘం అధికారులు స్పందించి వివరణ ఇచ్చారు.

ఢిల్లీ వ్యాప్తంగా సుమారు 33.1 లక్షల మంది ఓటర్లకు ఎస్ఐఆర్ నోటీసులు అందినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

ఈ నోటీసులు అందుకున్న వారిలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేఖా గుప్తా, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉన్నారు.

సీఎం రేఖా గుప్తాకు వయసు నమోదులో వ్యత్యాసం కారణంగా నోటీసు అందినట్లు ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి.

ఇది జాబితా నుంచి తొలగింపు కాదని, కేవలం వివరాల్లో నమోదైన వ్యత్యాసాలను సరిచేసుకునేందుకు జారీ చేసిన నోటీసు మాత్రమేనని అధికారులు స్పష్టం చేశారు.

కేజ్రీవాల్, ఆయన కుటుంబ సభ్యుల పేర్లు జాబితా నుంచి గల్లంతయ్యాయని ఆప్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, నిబంధనల ప్రకారం అవసరమైన పత్రాలు సమర్పించి వివరాలు సరిచేసుకోవాలి ఎన్నికల సంఘం సూచించింది.

ఈ వివాదం ఢిల్లీ రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వెబ్ స్టోరీస్

KCR assets: కేసీఆర్, రేవంత్ రెడ్డి ఆస్తుల వివాదం.. రగుల...Gas Cylinder: EKYC చేయకపోతే గ్యాస్ సిలిండర్ కట్?Visakhapatnam water: విశాఖ నీటి సంక్షోభంపై వైసీపీ ఆందోళ...