రోజూ టీ తాగడం లేదా.. అయితే  ఈ ప్రయోజనాలు మీరు మిస్ అయినట్లే!

టీ తాగడం వల్ల అప్పటి వరకూ ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. ఇంటి , ఆఫీస్ పనులతో తలబద్దలయితే మొదటిసారిగా గుర్తొచ్చేది టీనే .. 

టీ  వల్ల మేలే అంటున్నారు నిపుణులు.  ఇది నాలుకకు ఇచ్చే రుచి శరీరంలో కలిగించే వెచ్చదనం ఉపశమనం కలుగిస్తుందట. 

శరీరానికి విటమిన్స్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు అందజేస్తుంది. ఎముకలు కూడా దృఢంగా మారాతాయట. 

అయితే కొంతమంది అదే పనిగా టీ తాగుతుంటారు. టీని మితంగానే తాగాలంటున్నారు నిపుణులు. గ్రీన్ టీ, బ్లాక్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలట! 

ఇవి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వీటిలో ఉండే బలమైన పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ స్థాయిలను సమతుల్యం చేస్తాయి .

టీ ని తక్కువ మోతాదులో తాగుతూ ఎన్నో రకాల జబ్బులను అరికట్టవచ్చు. దీని వల్ల శరీరం ఆరోగ్యం మెరుగుపడుతుందంటే నమ్మాల్సిందే.