ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా ?

ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే మంచిదని నిపుణులు చెబుతున్నారు..  ఒక పండు కూడా తినాలని చెబుతున్నారు.

బొప్పాయిని ఖాళీ కడుపుతో తింటే ఎక్కువ ప్రయోజనాలు వీటిలో విటమిన్స్ అధికం. ఉదయం తీసుకుంటే చాలా సమస్యలకు చెక్ పెడుతుంది..

కివిలో విటమిన్ సి పుష్కలం. దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగు. పొట్టలోని వ్యర్థాలను బయటకు పంపించి, పొట్టను శుభ్రం చేస్తుంది.. 

ఖాళీ కడుపుతో అరటిపండ్లు తింటే జీర్ణవ్యవస్థకు మేలు. అరటిపండులో పొటాషియం, ఫైబర్ అధికంగా ఉండడం వల్ల త్వరగా జీర్ణమవుతాయి.. 

నారింజ పండ్లు ఉదయాన్నే తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఈ పండు ద్వారా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు దూరం.