అక్కడ కూడా కేసీఆర్ కి పరాభవం.. PM కాండిడేట్ ఇలా అయ్యాడేంటి?

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ముగిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరింది. కెసిఆర్ అవినీతిపై సీఎం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 

ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ బీజేపీ లు తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి.  అందుకు కార్యాచరణ మొదలుపెట్టాయి. 

టైమ్స్ నౌ-ఈటీజీ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తన సర్వే నిర్వహించింది. ఎన్నికలు జరిగితే ఏ పార్టీకికి ఎన్ని సీట్లు వస్తాయో అంచనా వేసింది. 

సర్వే అంచనాల ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 8-10 సీట్లు, BRS 3-5 స్థానాలు, బీజేపీ 3-5 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. 

ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉన్నందున, రేవంత్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు పార్టీ ఓట్లకు కీలకం కానుండగా కేసిఆర్ వ్యూహం ఎలా ఉంటుందో చూడాలి.