పల్లవి ప్రశాంత్ గెలవాలని అభిమాని ఏం చేశాడో తెలుసా?

రైతుబిడ్డగా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు..ఇప్పుడు టాప్ లో అతని పేరే ఎక్కువగా వినిపిస్తుంది.. 

కామన్ మ్యాన్ అయ్యుండి సెలబ్రిటీలకు గట్టి పోటీని ఇస్తుండగా అతన్ని విన్నర్ ని చేయడానికి అభిమానులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 

చిట్యాల గ్రామానికి చెందిన ప్రశాంత్ అభిమాని ఒకరు  సైకిల్ యాత్ర చేపట్టాడు. చిట్యాల నుండి బిగ్ బాస్ హౌస్ కి సైకిల్ మీద రానున్నాడు. 

ప్రశాంత్ ను గెలిపించండి.. అంటూ వినూత్న ప్రయత్నం చేస్తున్నాడు.. టైటిల్ పోరు ప్రధానంగా అమర్ దీప్, శివాజీ, ప్రశాంత్ మధ్య జరగనుంది.  

ఈ ముగ్గురిలో ఒకరు టైటిల్ కొడతారని మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయం.. మరి ఎవరు విన్నర్ గా నిలుస్తారో  చూడాలి.