ఆ సమస్యలు ఉన్నవారు పచ్చిబఠానీ తింటే అంతే సంగతులు?

పచ్చి బఠానీలు ఆరోగ్యానికి మంచివే. వీటిలో విటమిన్లు అమైనో ఆమ్లాలు ఉంటాయి. అయితే ఇవి ఎక్కువగా తీసుకోవడం అనారోగ్యం.

అంతేకాకుండా కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు ఈ పచ్చి బఠానీలు తీసుకోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. 

ఆసిడిటీ, గ్యాస్ సమస్యలున్న వారు ఇవి తీసుకోకూడదు. వీటితో చేసిన కూరలు రాత్రి సమయంలో తీసుకుంటే జీర్ణం సమస్యలు వస్తాయి.

పచ్చి బఠానీలలో ప్రోటీన్, పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కావున బఠానీలను ఎక్కువగా తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. 

కిడ్నీ సమస్యలు , కీళ్లనొప్పులు  ఉన్నవారు పూర్తిగా తగ్గించాలి. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేనివారు కూడా ఎక్కువగా తీసుకోకూడదు.