రూ.1,923కే విమానం ఎక్కేయండి..  టికెట్లపై భారీ డిస్కౌంట్

విమాన ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త. అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. విస్తారా ఎయిర్‌లైన్స్ తాజాగా అదిరే ఆఫర్ తీసుకువచ్చింది. 

ఈ కంపెనీ ప్రత్యేకంగా వింటర్ సేల్ నిర్వహిస్తోంది. అందువల్ల విమాన ప్రయాణం చేయాలని భావించే వారు తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. 

వింటర్ సేల్‌లో భాగంగా మీరు ఫ్లైట్ టికెట్లను రూ. 1923 ప్రారంభ ధరతో బుక్ చేసుకోవచ్చు. డొమెస్టిక్ రూట్లకు మాత్రమే ఈ ఫ్లైట్ టికెట్ బుకింగ్ ఆఫర్ వర్తిస్తుంది. 

ఆఫర్‌లో భాగంగా విమాన టికెట్లు బుక్ చేసుకోవాలని భావించే వారు డిసెంబర్ 11 నుంచి 2024 సెప్టెంబర్ 30 వరకు ఎప్పుడైనా జర్నీ ప్లాన్ చేసుకోవచ్చు. 

ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది కేవలం బేస్ ఫేర్‌కు మాత్రమే వర్తిస్తుంది. అంటే అదనపు చార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు టికెట్ రేటు పైకి చేరుతుంది.